Covid 19: అమెరికా, దక్షిణ కొరియాలో భారీగా కేసులు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
ప్రాణాంతక మహమ్మారి కాటుకు లక్షల మంది బలయ్యారు. క్రమంగా వైరస్ వ్యాప్తి నిలిచిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, కోవిడ్–19 మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
అమెరికాలో 25 రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో చాలామంది కరోనా బారినపడి, చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ఇండియాలో ఈ ఏడాది జూన్, జూలైలో 908 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు బాధితులు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో జూన్ 24 నుంచి జూలై 21 మధ్య వారానికి సగటున 17,358 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది.
Eye Bleeding Virus: పాక్‌లో ప్రాణాంతక వైరస్.. భారత్‌కూ ముప్పే.. దీనిని నివారించడం చాలా కష్టం!!
ఇతర దేశాల్లో ఉన్నట్లుగా ఇండియాలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా మనం అన్నింటికీ ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండడం మంచిదని నోయిడాలోని శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, వైరాలజిస్టు దీపక్ సెహగల్ సూచించారు.
వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఈసారి వైరస్ వ్యాప్తిలో వేగం 11 శాతం పెరిగిందని, బాధితుల్లో 26 శాతం మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసిందని వెల్లడించారు.
Most Expensive Coin: అత్యంత ఖరీదైన నాణేలు.. వందేళ్ల తర్వాత వేలానికి..!