Skip to main content

Eye Bleeding Virus: పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పే.. దీనిని నివారించడం చాలా కష్టం!!

ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్‌ఎఫ్‌(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది.
Deadliest Eye-Bleeding Virus, Know All About Crimean-Congo Hemorrhagic Fever

దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్‌ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతుండంతో ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపిన వివరాల ప్రకారం.. ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలా కష్టం.  చికిత్స కూడా అంతసులభమేమీ కాదు. 
ఐ బ్లీడింగ్‌ వైరస్‌ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్‌లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్‌ (పేలు తరహాలోని పరాన్న జీవి) కాటు ద్వారా ఈ వైరస్‌ వృద్ధి చెందుతుంది. సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ తల్లి నుంచి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. 

WHO Notice : అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్న వైరస్‌.. డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌క‌ట‌న!

ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షలాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులకు ఈ వైరస్‌ సోకినప్పుడు  అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సీసీహెచ్‌ఎఫ్‌ అనేది ప్రాణాంతక వ్యాధి.. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్‌ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్‌లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్‌ఎఫ్‌ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

Mpox Virus: బీ అలర్ట్.. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న మంకీపాక్స్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..

Published date : 29 Aug 2024 08:49AM

Photo Stories