Skip to main content

H3N2 Influenza: కోవిడ్‌ తరహాలో విస్తరిస్తున్న హెచ్‌3ఎన్‌2.. విపరీతంగా పెరుగుతున్న కేసులు

దేశాన్ని మరో కొత్త వైరస్‌ భయపెడుతోంది. హెచ్‌3ఎన్‌2 అనే కొత్త రకం వైరస్‌ కారణంగా దగ్గు, జలుబు, జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు.
H3N2 Influenza

అచ్చంగా కోవిడ్ లక్షణాలు కలిగిన ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత కొంత కాలంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తర భారతంలో ప్రతీ ఇద్దరిలో ఒకరు దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వైరస్‌ కోవిడ్‌ తరహాలో తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీలోని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. పండగల సీజన్‌ కావడంతో ప్రజలందరూ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పది మందిలోకి వచ్చినప్పుడు మాస్క్‌ ధరించడం తప్పనిసరిగా చేయాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతీ ఏడాది వేసవి కాలం సమీపిస్తున్నప్పుడు వైరస్‌లు ఉత్పరివర్తనం చెందుతూ అత్యధికులకు సోకుతూ ఉంటాయని, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా వీటి బారిన పడుతున్నారని గులేరియా తెలిపారు. 
‘‘హెచ్‌1ఎన్‌1 కారణంగా కొన్నేళ్ల క్రితం మన దేశాన్ని ఒక మహమ్మారి ఊపేసింది. ఇప్పుడు ఆ వైరస్‌ పలుమార్లు మ్యుటేషన్‌కు లోనై ప్రస్తుతం విజృంభిస్తున్న హెచ్‌3ఎన్‌2 రూపంలో ఉంది. ఇదంత ప్రమాదకరమైన వైరస్‌ కాకపోయినప్పటికీ దీనిని తట్టుకునే రోగనిరోధక శక్తి మనకి లేకపోవడం వల్ల త్వరగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. చలి తగ్గి, ఎండ వేడి పెరుగుతున్న దశలో ఇలాంటి వైరస్‌లో విజృంభించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అంతగా లేకపోవడం గొప్ప ఊరటనిచ్చే అంశం.  

Zombie Drug: అమెరికాను వణికిస్తున్న జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!


వైరస్‌ లక్షణాలు  
ఫ్లూ జ్వరానికి మరో రూపమే హెచ్‌3ఎన్‌2 వైరస్‌. ఇది సోకితే చలి, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు ముక్కు కారడం, గొంతు నొప్పి, వళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి 

చికిత్స ఏమిటి?  
ఈ వైరస్‌కు ప్రత్యేకంగా చికిత్స లేదు. సాధారణ ఫ్లూకి ఇచ్చే మందులే ఇస్తారు. హెచ్‌3ఎన్‌2 లక్షణాలుంటే పూర్తిగా విశ్రాంతి తీసుకొని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.  
ఎలా వ్యాపిస్తుంది ? 
ఈ వైరస్‌ నోటి తుంపర్ల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు వైరస్‌ను వ్యాప్తి చేస్తున్నాయి. గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు అత్యధికంగా దీని బారిన పడుతున్నారు.  
ఏం చెయ్యాలి..? 
• మాస్కు ధరించాలి. జనసమ్మర్థానికి దూరంగా ఉండాలి 
• చేతులు తరచూ సబ్బుతో కడుగుతూ ఉండాలి 
• మీ నోటిని, ముక్కుని చేతులతో తాకవద్దు 
• దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ముఖాన్ని కప్పుకోవాలి 
• జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి 
ఏమి చెయ్యకూడదు 
• బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు 
• ఇతరులతో కరచాలనం చెయ్యవద్దు 
• సొంత వైద్యం చెయ్యకూడదు. 
• పక్కనే ఎవరైనా ఉంటే ఆహారం తీసుకోవద్దు.  

Digital Payments: భార‌త్‌, సింగ‌పూర్ మ‌ధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్

Published date : 08 Mar 2023 02:39PM

Photo Stories