Skip to main content

Influenza Virus: వ‌ణికిస్తోన్న ఇన్‌ఫ్లుయెంజా... ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే అంతే...

కరోనా తర్వాత.. చాన్నాళ్లకు ఆ తరహా లక్షణాలు చాలామందిలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కరోనా కాదు.. కరోనా లాంటి లక్షణాలు మాత్రమే!. ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలతో కేసులు దేశంలో విపరీతంగా నమోదు అవుతున్నాయి. రెండు నెలలుగా ఈ కేసులు దేశంలో దాదాపు అన్నిచోట్లా రికార్డు అయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
Influenza Virus

దగ్గు, జలుబుతో పాటు చాలాకాలంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు చాలామంది. ఈ నేపథ్యంలో కేంద్రం పరిధిలోని వైద్య విభాగాలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. 
దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
దేశంలో గత కొన్నివారాలుగా జ్వరం, జలుబు, దగ్గు కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. కరోనా ఏమో అనే భయాందోళనతో చాలామంది యాంటీ బయాటిక్స్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది శరీరానికి ఏమాత్రం మంచిది కాదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌​ మెడికల్‌ రీసెర్చ్‌ హెచ్చరిస్తోంది. అది కరోనా కాదని.. ఇన్‌ఫ్లూయెంజా A సబ్‌టైప్‌ H3N2 వైరస్‌.. దేశంలో ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణమని స్పష్టం చేసింది. 

చ‌ద‌వండి: ఇంట‌ర్ హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌... ప్రిన్సిప‌ల్ సైన్ లేక‌పోయినా...
ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఫ్లూ నే ....
రెండు, మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ ‘హెచ్‌3ఎన్‌2’ రకం ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు, జ్వరం. దీంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: ఎవ‌ర్ని తొల‌గించాలో చెప్పండి... ఉద్యోగుల మెడ‌పై క‌త్తి
ఈ జాగ్రత్తలు తప్పనిసరి....
ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఐసీఎంఆర్ కొన్ని జాగ్రత్తలు చెప్పింది. అవి..
- తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.
- మాస్క్ ధరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లక‌పోవ‌డ‌మే మంచింది.
- నోరు, ముక్కును పదే పదే తాకొద్దు.
- దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు మీ ముక్కు, నోటిని కవర్‌ చేసుకోవాలి.
- ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అధిక మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి.
- జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మందులు వాడాలి.
ఇవి మాత్రం అస్స‌లు చేయొద్దు....
- షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం.. హ‌గ్‌(HUG)చేసుకోవడం వంటివి చేయొద్దు.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం చేయ‌కూడ‌దు.
- ఇతరులు లేదా కుటుంబసభ్యులకు దగ్గరగా కూర్చుని ఆహార పదార్థాలను తినకూడదు.
- సొంత చికిత్సలు వద్దు. యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాలను వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలి.
- వీరిలో కొందరికి కొవిడ్‌ తరహా లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే పరీక్షల్లో వారికి నెగెటివ్‌ వస్తోంది. అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వైరస్‌ పట్ల అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉంటే చాలు అని వైద్యులు సూచిస్తున్నారు.

Published date : 07 Mar 2023 05:31PM

Photo Stories