XEC Covid Variant: మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి.. ఏకంగా 27 దేశాలకు..!
ఆల్ఫా, బీటా, ఓమిక్రాన్ వంటి వేరియంట్లు తర్వాత ఇప్పుడు ఎక్స్‌ఈసీ అనే కొత్త వేరియంట్ వచ్చి చేరింది.
ఎక్స్‌ఈసీ(XEC) అంటే ఏమిటి:
ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ హైబ్రిడ్ కేఎస్ 1.1, కేపీ, 3.3ల కలయిక.
ఎక్కడ వ్యాపిస్తోంది:
జర్మనీలో మొదట కనిపించి, యూకే, యూఎస్, డెన్మార్క్, పోలాండ్, చైనాతో సహా 27 దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం యూరప్‌లో వేగంగా విస్తరిస్తోంది.
లక్షణాలు: జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు.
తీవ్రత: ఇతర వేరియంట్ల కంటే తొందరగా వ్యాపిస్తుంది. కానీ తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, శీతకాలంలో తీవ్రత పెరగవచ్చు.
నివారణ: టీకాలు, బూస్టర్ డోసులు తీసుకోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి ముఖ్యం.
Mpox Vaccine: వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్‌కు తొలి టీకా అనుమతి
నిపుణుల అభిప్రాయం ఇదే..
ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్: ఈ వేరియంట్ తొందరగా వ్యాపిస్తుంది. కానీ టీకాల వంటి రక్షణ అందిచడం మంచిదని సూచించారు.
ఎరిక్ టోపోల్: ఈ వేరియంట్ ఉధృతి ఇప్పుడే ప్రారంభమైంది. తీవ్ర రూపం దాల్చడానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్లొచ్చు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ): ప్రజలందర్నీ పరిశుభతను పాటించడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.