Mpox Vaccine: వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్‌కు తొలి టీకా అనుమతి
ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) దాని చికిత్స కోసం మొదటి వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.
వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నందున వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని వెల్లడించింది.
తయారీ సంస్థ ఒక్కటే కావడంతో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో తక్షణమే ఈ వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.
Covid 19: ఈ దేశాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు
మరోవైపు.. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంCటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు.