Skip to main content

TS INTER Hall Tickets: ఇంట‌ర్ హాల్ టికెట్లు వ‌చ్చేశాయ్‌... ప్రిన్సిప‌ల్ సైన్ లేక‌పోయినా...

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల హాల్ టికెట్ల‌ను తెలంగాణ ఇంట‌ర్‌మీడియ‌ట్ బోర్డు అందుబాటులో ఉంచింది. మార్చి 6వ తేదీ సాయంత్రం 5 గంట‌ల నుంచి హాల్ టికెట్ల‌ను www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని బోర్డు వెల్ల‌డించింది.
Inter Students

కళాశాలల ప్రిన్సిపల్స్ వెంట‌నే విద్యార్థుల‌కు హాల్ టికెట్ల‌ను అంద‌జేయాల‌ని ఆదేశించింది. ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభమవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు బోర్డు కార్యదర్శి నవీన్ మిట్ట‌ల్ ప్రకటన విడుద‌ల‌ చేశారు. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే ప్రిన్సిపల్స్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఒక‌వేళ విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ల‌పై ప్రిన్సిప‌ల్ సంత‌కం లేక‌పోయినా.. ప‌రీక్ష హాల్‌కు అనుమ‌తించాల‌ని  పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆయ‌న‌ ఆదేశించారు. హాల్ టికెట్లను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Published date : 07 Mar 2023 01:54PM

Photo Stories