IT Crisis: ఎవర్ని తొలగించాలో చెప్పండి... ఉద్యోగుల మెడపై కత్తి పెట్టిన ఫేస్‌బుక్
చదవండి: హాఫ్ జీతానికే పనిచేయండి... లేదంటే.. ప్రెషర్స్‌కు ఐటీ కంపెనీ షాక్
ఉద్యోగుల మెడపై కత్తి..!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక అనిశ్చితితో మరోసారి సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
పింక్ స్లిప్‌లు జారీ...
రెండో దఫా తొలగింపులపై బ్లూమ్‌బర్గ్ ఫిబ్రవరిలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆ కథనానికి కొనసాగింపుగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసేందుకు మెటా సిద్ధమైంది. జుకర్ బర్గ్ నిర్ధేశించిన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ మెటా ఇంటర్నల్ మీటింగ్‌లో పాల్గొని..పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు.
చదవండి: Twitter: ఆగని తొలగింపుల పర్వం... ఈసారి ఎంత మంది అంటే
ఎవర్ని తొలగించాలో చెప్పండంటూ...
కంపెనీల నుంచి మెటాకు వచ్చే యాడ్స్ తగ్గిపోవడంతో సంస్థ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌పై దృష్టిసారించింది. పొదుపు మంత్రం జపిస్తూనే ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలి? ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్‌లను అడుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.