IT Crisis: హాఫ్ జీతానికే పనిచేయండి... లేదంటే.. ప్రెషర్స్‌కు ఐటీ కంపెనీ భారీ షాక్

కొన్ని సంస్థలు అధిక శాలరీలు ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టి వారిని సాగనంపుతున్నాయి. అయితే విప్రో మాత్రం ఫ్రెషర్స్‌కు షాక్ ఇచ్చింది.
సగం జీతానికే పనిచేస్తారా..?
కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థ విప్రో ఝలక్ ఇచ్చింది. మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సగానికి పనిచేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని కోరింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్ ద్వారా అడిగింది.
చదవండి: ఆటంబాంబు పేల్చిన గూగుల్.. భారీగా తొలగింపులు
ఈ మెయిల్ ద్వారా అభ్యర్థన
పరిశ్రమలో ఇతరుల మాదిరిగానే తాము కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా నియామకాలు చేపడుతుంటామని విప్రో పేర్కొంది. ప్రస్తుతం తమకు రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పనిచేసే ప్రాజెక్ట్ ఇంజనీర్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అభ్యర్థులకు పంపించిన ఈ-మెయిల్‌లో వివరించింది.
ఇప్పటికే 425 మందికి గుడ్‌బై
అయితే తాజాగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్స్‌కు ఈ ఆఫర్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు కూడా పూర్తయింది. ఫిబ్రవరి 16వ తేదీ ఫ్రెషర్స్‌కు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కంపెనీ. ఫిబ్రవరి 20వ తేదీలోపు నిర్ణయాన్ని తెలియజేయాలని అందులో కోరింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఆన్ బోర్డింగ్ చేయించుకునేందుకు జాప్యం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా దాన్ని మార్చికి వాయిదా వేసింది.
చదవండి: దినదినగండంలా ‘‘ఐటీ’’ ఉద్యోగాలు...!
అయితే శిక్షణ కాలంలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మంది ఫ్రెషర్‌లను తొలగించిన నేపథ్యంలో.. మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ ఆఫర్‌ను తిరస్కరిస్తే తమను సాగనంపుతారేమోనన్న భయం ఫ్రెషర్స్‌లో కనిపిస్తోంది.