దినదినగండంలా ‘‘ఐటీ’’ ఉద్యోగాలు...!
తాజాగా అమెజాన్‌లో ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓం ప్రకాశ్ శర్మ ఉద్యోగం పోవడంతో తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని నెటిజన్లతో పంచుకున్నారు.
లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అమెజాన్ మాజీ ఉద్యోగి, సీనియర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ ఓంప్రకాష్ శర్మ లేఆఫ్స్‌పై స్పందించారు.‘2022 నా జీవితంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న సంవత్సరం. ఐసీయూలో రెండు, మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత మా నాన్నని కోల్పోయాను. ఆ కారణంగా నాలుగు నెలలు పాటు ఆఫీస్ వర్క్ చేయలేదు. ఈ ఏడాది జనవరి 11న అమెజాన్ తొలగించిన ఉద్యోగుల్లో నేనూ ప్రభావితమయ్యా’ అని పేర్కొన్నారు.
‘‘ అమెజాన్ లో ఉద్యోగం చేసిన ఐదేళ్లు ప్రొఫెషనల్ కెరియర్‌లోనే అత్యంత అద్భుతమైన సమయం. సహచర ఉద్యోగులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాధించాను. అయితే, వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు మీ సహాయం అవసరం. దయచేసి నాకు సరైన అవకాశం కల్పించేలా చూడండి’’ అని శర్మ లింక్డ్‌ఇన్‌లో రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.