TCS NQT Exam: 1.6 లక్షల పోస్టులకు అవకాశం.. పరీక్షలో విజయానికి మార్గాలు..
- టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్‌తో ఐటీ, నాన్-ఐటీలో ఉద్యోగాలు
- 23 రంగాల్లో దాదాపు 1.6 లక్షల పోస్టులకు అవకాశం
- టీసీఎస్‌తోపాటు పలు ఎంఎన్‌సీలకు ప్రామాణికం ఈ పరీక్ష
- డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు
టీసీఎస్ సంస్థ ఆఫ్-క్యాంపస్ నియామకాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష.. టీసీఎస్ ఎన్‌క్యూటీ. ఈ పరీక్షను ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, కాగ్నిటివ్ టెస్ట్‌ల పేరుతో నిర్వహిస్తారు. దీన్ని టీసీఎస్ ఐయాన్ ఆధ్వర్యంలో ఆరేళ్ల క్రితం రూపకల్పన చేశారు. ప్రారంభంలో ఈ టెస్ట్ స్కోర్ టీసీఎస్‌లో ఉద్యోగాలకు మాత్రమే ప్రామాణికంగా నిలిచేది. ఇప్పుడు టీసీఎస్‌తోపాటు అనేక సంస్థలు ఎన్‌క్యూటీ స్కోర్ ఆధారంగా ఆఫ్ క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి.
ఐటీ, నాన్-ఐటీ విభాగాలు
టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్ ఆధారంగా ఐటీతోపాటు నాన్-ఐటీ రంగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది. ఆయా సంస్థల్లో ఐటీ, నాన్-ఐటీ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలా మొత్తం 1.6 లక్షలకుపైగా ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం టీసీఎస్ ఎన్‌క్యూటీ ఆధారంగా లభిస్తోంది.
చదవండి: Engineering Jobs: స్టార్టప్ ఆఫర్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
అర్హతలు
2018-2024 మధ్య కాలంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ప్రస్తుతం చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీ-ఫైనల్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండేళ్ల కంటే తక్కువ పని అనుభవం ఉన్న వారికి కూడా దరఖాస్తుకు అవకాశం ఉంది. వయసు: 30ఏళ్ల లోపు ఉండాలి.
రూ.లక్షల్లో వేతనాలు
టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్ ఆధారంగా కొలువులు సొంతం చేసుకున్న వారికి రూ.లక్షల్లో వార్షిక వేతనాలు లభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌కు సగటున రూ. 8 లక్షలు, అనుభవం ఉన్న వారికి సగటున రూ.12 లక్షల వార్షిక వేతనం అందుతోంది.
ఎన్‌క్యూటీ మూడు విధాలుగా
టీసీఎస్ ఎన్‌క్యూటీని మూడు రకాలుగా నిర్వహిస్తారు. అవి.. ఎన్‌క్యూటీ-కాగ్నిటివ్, ఎన్‌క్యూటీ-ఐటీ, ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐ. అభ్యర్థులు తాము చేరాలనుకుంటున్న రంగాలకు అనుగుణంగా ఈ పరీక్షలను ఎంచుకోవచ్చు.
ఎన్‌క్యూటీ-కాగ్నిటివ్
ఎన్‌క్యూటీ కాగ్నిటివ్ పరీక్షను జనరల్ ఎబిలిటీ టెస్ట్‌గా పరిగణిస్తారు. ఈ టెస్ట్‌లో మూడు విభాగాలు.. న్యూమరికల్ ఎబిలిటీ (20 మార్కులు), వెర్బల్ ఎబిలిటీ (25 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (20 మార్కులు)ల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇలా మొత్తం 65 మార్కులకు 105 నిమిషాల్లో పరీక్ష ఉంటుంది. కాగ్నిటివ్ టెస్ట్‌లోనే సైకోమెట్రిక్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా టీసీఎస్‌తోపాటు మరెన్నో సంస్థల్లో ఐటీ/బీపీఓ; ఐటీ/ప్రొడక్ట్ సర్వీస్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆటోమోటివ్, ఈ-కామర్స్/ఇంటర్నెట్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్, టెలికం, మార్కెటింగ్ అండ్ అడ్వర్టయిజింగ్, ఎడ్-టెక్ వంటి రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఎన్‌క్యూటీ-ఐటీ
ఐటీ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌లో డెవలపర్, సిస్టమ్ ఇంజనీర్, ఐటీ అనలిస్ట్ వంటి ఉద్యోగాలకు మార్గంగా ఎన్‌క్యూటీ-ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నిలుస్తుంది. ఈ పరీక్షను పార్ట్-ఎ (ఫౌండేషన్ సెక్షన్), పార్ట్-బి (అడ్వాన్స్‌డ్ సెక్షన్)లుగా నిర్వహిస్తారు. పార్ట్-ఎ ఫౌండేషన్ సెక్షన్‌లో న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 65 మార్కులకు 75 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్-బి అడ్వాన్స్‌డ్ సెక్షన్‌లో అడ్వాన్స్‌డ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్ రీజనింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్‌డ్ కోడింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 95 మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. వీటితోపాటు సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తారు. అదే విధంగా మోటివేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 30 నిమిషాలు. ఇలా మొత్తం 2.15 గంటల వ్యవధిలో ఎన్‌క్యూటీ-ఐటీ పరీక్షను నిర్వహిస్తారు.
చదవండి: Campus Placement: క్యాంపస్ డ్రైవ్స్.. ఆఫర్ దక్కేలా!
ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐ
బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి అవకాశం కల్పించే పరీక్ష.. ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐ. ఇందులో స్కోర్ ఆధారంగా బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్, అకౌంట్స్ ఆపరేషన్స్ ఆఫీసర్, డేటా అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆపరేషన్స్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, టెల్లర్, క్యాషియర్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐను కూడా పార్ట్-ఎ (కాగ్నిటివ్), పార్ట్-బి (బీఎఫ్‌ఐఎస్) పేరుతో రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
పార్ట్-ఎ కాగ్నిటివ్ టెస్ట్‌లో న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 65 మార్కులకు 75 నిమిషాల వ్యవధిలో పార్ట్-ఎ ఉంటుంది. పార్ట్-బి(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అండ్ ఇన్సూరెన్స్)లో కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవేర్‌నెస్, ఇన్సూరెన్స్ అండ్ ఎకానమీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 75 మార్కులకు 75 నిమిషాల్లో పరీక్ష నిర్వహిస్తారు. దీంతోపాటు సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది.
స్కోర్‌కు రెండేళ్ల గుర్తింపు
టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్‌కు రెండేళ్ల గుర్తింపు ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒకసారి స్కోర్ తక్కువ వచ్చినా.. దానిని మెరుగుపరచుకునేందుకు మరోసారి ఎన్‌క్యూటీకి హాజరవ్వచ్చు. ఇలా అభ్యర్థులు నిర్దిష్ట వయో పరిమితిలోపు ఎన్నిసార్లైనా పరీక్షకు హాజరై తమ స్కోర్‌ను పెంచుకునే అవకాశం ఉంది.
ఎన్‌క్యూటీ, ఐయాన్‌లలో జాబ్స్‌కు దరఖాస్తు
టీసీఎస్ ఎన్‌క్యూటీలో స్కోర్ పొందిన అభ్యర్థులు దాని ఆధారంగా టీసీఎస్ ఎన్‌క్యూటీ వెబ్‌సైట్, టీసీఎస్ ఐయాన్ వెబ్‌సైట్లలో లాగిన్ అయి.. వాటిలో రిజిస్టర్ చేసుకున్న సంస్థలు-ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీసీఎస్ ఎన్‌క్యూటీ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్న సంస్థలు ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో ఈ స్కోర్ వివరాలను అడుగుతాయి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 27,2023
- ఎన్‌క్యూటీ పరీక్షతేదీ: డిసెంబర్ 9, 2023
- పరీక్ష కేంద్రాలు: టీసీఎస్ ఐయాన్ సెంటర్లు
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://learning.tcsionhub.in/hub/nationalqualifiertest
మంచి స్కోర్‌కు మార్గమిదే
న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగంలో ఫ్య్రాక్షన్స్, ప్రాబబిలిటీ, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా, స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నంబర్ సిస్టమ్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎం, పర్సంటేజెస్ వంటి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 12వ తరగతి స్థాయిలో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: Tech skills: ఈ స్కిల్స్ నేర్చుకోండి... టెక్ జాబ్ పట్టండి
వెర్బల్ ఎబిలిటీ
యాంటానిమ్స్, సినామిన్స్, స్పాటింగ్ ది ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, క్లోజ్ టెస్ట్, వెర్బల్ అనాలజీస్, సెంటెన్స్ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్-ఇన్‌డైరెక్ట్ స్పీచ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్ గ్రామర్‌పై పదో తరగతి స్థాయిలో అవగాహన పొందాలి.
రీజనింగ్ ఎబిలిటీ
ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్‌మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ, సిరీస్, పజిల్స్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రమ్స్, విజువల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
అడ్వాన్స్‌డ్ కోడింగ్
ఎన్‌క్యూటీ-ఐటీ పరీక్షలో ఉండే ఈ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా సి, సి++, జావా, పైథాన్ వంటి లాంగ్వేజ్‌లపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్
ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐలో ఉండే ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు,నూతన ఆర్థిక విధానాలు,ఆర్బీఐ విధానాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
ఇన్సూరెన్స్ అండ్ ఎకానమీ
ఎన్‌క్యూటీ-బీఎఫ్‌ఎస్‌ఐలోనే మరో విభాగంగా ఉండే ఇన్సూరెన్స్ అండ్ ఎకానమీల కోసం ఇన్సూరెన్స్ రంగంలో నూతన పరిణామాలు, ఇన్సూరెన్స్‌లు-రకాలు, ఐఆర్‌డీఐ, ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
Tags
- TCS NQT
- Job Trends
- Tata Consultancy Services
- Tata Consultancy Services jobs
- national qualifier test
- Software Jobs
- Careers
- Career Opportunities
- IT and non-IT
- TCS NQT Exam Date
- TCS NQT Details
- Sakshi Bhavitha
- TCS National Qualifier Test 2023
- JobOpenings
- EmploymentOpportunities
- TestScore
- JobMarketChallenges
- CareerGrowth
- TechnologyExam
- ITJobs
- NonITCareers
- CareerOpportunities
- ProfessionalDevelopment
- SoftwareIndustry
- TataConsultancyServices
- Sakshi Education Latest News