CMAT 2024: మేనేజ్‌మెంట్ విద్యకు మార్గం.. కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)
- సీమ్యాట్ 2024కు ప్రకటన విడుదల
- దేశవ్యాప్త విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశం
అర్హత
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో సీమ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయసు నిబంధన లేదు.
400 మార్కులకు సీమ్యాట్
ఆన్‌లైన్ విధానంలో 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున 5 విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగాల్లో ఈ ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులుంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఒక్కోమార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.
చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
పరీక్షకు ప్రిపరేషన్ ఇలా
- ప్రాథమిక అధ్యయనం పూర్తయిన తర్వాత సీమ్యాట్ గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీటిద్వారా ప్రశ్నలు అడిగే సరళి అర్థం అవుతుంది. పరీక్షకు ముందు వీలైనన్నీ మాక్ టెస్టులు రాయాలి. సూత్రాలు ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. షార్ట్‌కట్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. ఐసెట్, మ్యాట్ సన్నద్ధత సీమ్యాట్‌కు ఉపయోగపడుతుంది.
- లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: అభ్యర్థి ప్రాథమిక ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పులను గుర్తించడం, సమా«నార్థాలు, వ్యతిరేకపదాలు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వ్యాక్యలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్దతిలో అమర్చడం, కాంప్రహెన్షన్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి.
- క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్: శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వయసు నిర్ణయించడం, రైళ్లు, పడవ వేగాలు , కసాగు, గసాభా, వైశాల్యాలు వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. అలాగే నంబర్ అనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్, ఫిగర్ అనాలజీ, వెన్ డయాగ్రమ్స్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్ మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవడం, మాక్ టెస్టులు రాయడం ద్వారా మంచి స్కోర్ చేయవచ్చు.
- లాజికల్ రీజనింగ్: ఈ విభాగంలో అజంప్షన్స్, కన్‌క్లూజన్‌లు, ఇన్ఫరెన్సెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్, అనలిటికల్ రీజనింగ్, లీనియర్ అరెంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ రీజనింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
- జనరల్ అవేర్‌నెస్: ఇందులో ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడిన అంశాలతోనే వస్తాయి. పర్యావరణాంశాలు, వర్తమాన వ్యవహారాలపై ప్రశ్నలుగా అడుగుతారు. వీటితోపాటు భారత్-పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. హైస్కూల్ సోషల్, సైన్స్ పాఠ్యపుస్తకాలు చదవాలి. తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
- ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్: వివిధ కొత్త అవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలి. కొత్త వ్యాపారం, స్టార్ట్ అప్‌లకు సంబంధించిన పథకాలు, ప్రోత్సాహాకాలపై పరిజ్ఞానం ఉండాలి. తాజా వ్యాపార ధోరణులు, పెట్టుబడులు ఎఫ్‌డీఐ, స్కిల్ డెవలప్‌మెంట్, వెంచర్ క్యాపిటలిస్ట్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తదితర అంశాలు తెలుసుకోవాలి.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2024
- సవరణలకు అవకాశం: 2024 ఏప్రిల్ 19-21వ తేదీ వరకు
- సీమ్యాట్ పరీక్ష: 2024, మేలో నిర్వహిస్తారు
- వెబ్‌సైట్: https://exams.nta.ac.in/CMAT
Tags
- CMAT 2024
- CMAT 2024 Notification
- CMAT 2024 Important dates
- CMAT 2024 Score
- admissions
- Careers
- Management courses
- AICTE
- National Testing Agency
- Computer based test
- Entrance Exam
- Group Discussion
- Personal interview
- MBA Special
- CMAT Syllabus 2024
- Common Management Admission Test
- admissions in management courses
- CMAT Preparation Strategy