MAT Notification 2024: మేనేజ్‌మెంట్ పీజీకి.. మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)
- ఏడాదికి నాలుగుసార్లు పరీక్ష నిర్వహణ
- ఫిబ్రవరి సెషన్‌కు నోటిఫికేషన్ విడుదల
దేశ్యవ్యాప్తంగా ఉన్న బీస్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్షల్లో మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ఒకటి. జాతీయ స్థాయిలో ఏడాదికి నాలుగుసార్లు ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ స్కోరు ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం ఫిబ్రవరి సెషన్‌కు ప్రకటన వెలువడింది. పరీక్షను పేపర్ ఆధారిత (పీబీటీ), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఇంటర్నెట్ ఆధారిత పరీక్ష (ఐబీటీ).. ఇలా మూడు విధానాల్లో రాసుకునే వీలుంది. ఏవైనా రెండు విధానాలను కలిపి రాసుకునే అవకాశం కూడా ఉంది.
అర్హతలు
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు మ్యాట్ రాసేందుకు అర్హులు. ఆర్ట్స్/కామర్స్/ సైన్స్/ఇంజనీరింగ్/మెడిసిన్.. ఇలా ఏ విభాగంలో డిగ్రీ స్థాయి కోర్సు ఉత్తీర్ణులైనా మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఎంతుండాలనే నిబంధన ఏదీ పేర్కొనలేదు. అంటే..10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ఎవరైనా ఈ పరీక్ష రాయొచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం మ్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐబీటీ ఇలా
రిమోట్ ప్రోక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్టు (ఐబీటీ ) విధానంలో ఇంటి నుంచే పరీక్ష రాసుకోవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్‌క్యామ్ ఉంటే సరిపోతుంది. ప్రతి రోజూ రెండు స్లాట్లలో ఉదయం, మధ్యాహ్నం వీటిని నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించి ఇష్టమైన తేదీ, సమయం ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. పరీక్ష రాయాలనుకుంటున్న తేదీకి కనీసం 4 రోజుల ముందు దరఖాస్తు చేసుకున్నాæ సరిపోతుంది.
రాత పరీక్ష
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్,మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ అంశాల్లో.. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 30 నిమిషాలు, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ 30 నిమిషాలు, మ్యాథ్స్ స్కిల్స్ 40 నిమిషాలు, డేటా ఎనాలిసిస్ అండ్ సఫిషియన్సీ 35 నిమిషాలు, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌కు 15 నిమిషాల వ్యవధి కేటాయించారు.
ప్రిపరేషన్ పక్కాగా
- మ్యాట్ సిలబస్ ప్రకారం–ఆయా అంశాల అధ్యయనం ప్రారంభించాలి. చదివేటప్పుడే పాయింట్స్‌గా నోట్స్ రాసుకోవాలి. ఇది రివిజిన్ సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
- పోటీ పరీక్షలో ప్రతి మార్కు నిర్ణయాత్మకం అవుతుందున్న విషయాన్ని గుర్తించి పట్టుదలతో ప్రిపరేషన్ సాగించాలి.
- ఏ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
- అన్నింటికంటే ప్రధానమైనది మాక్ టెస్టుల ప్రాక్టీస్. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు ఇది చాలా అవసరం. ఒకటికి పదిసార్లు పాత ప్రశ్న పత్రాలు ప్రాక్టీస్ చేయడంతోపాటు నమూనా పరీక్షలు కూడా రాయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్కువగా సబ్జెక్టుపై పట్టు లభిస్తుంది. అంతేకాకుండా వేగం కూడా పెరుగుతుంది. ఇది పరీక్ష బాగా రాసేందుకు దోహదపడుతుంది.
చదవండి: UGC: ఇకపై పీజీ ఏడాదిలోనే... సబ్జెక్టులను మార్చుకునే అవకాశం కూడా... కానీ...
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ (పీబీటీ): ఫిబ్రవరి 20, 2024
- రాత పరీక్ష తేదీ (పీబీటీ): ఫిబ్రవరి 25, 2024
- సీబీటీ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: మార్చి 05, 2024
- సీబీటీ పరీక్ష తేదీ: మార్చి 10, 2024
- వెబ్‌సైట్: https://mat.aima.in/
Tags
- MAT Notification 2024
- admissions
- MBA Special
- Management PG Courses
- Management courses
- PG Courses
- Engineering
- Medicine
- Students
- Management Courses in PG
- MAT Registration 2024
- MAT Exam 2024
- Management Aptitude Test
- Careers
- All India Management Association
- Computer based test
- admission
- ManagementAptitudeTest
- PGCourses
- ExamDetails
- EligibilityCriteria
- ExamPattern
- sakshi education latest admissions