Skip to main content

IT Crisis: తుమ్మితే ఊడుతున్న‌ ఐటీ జాబ్స్‌... ఐఐటీ కొలువులకూ భద్రత లేదు..?

దేశంలో అత్యున్నత విద్యాసంస్థలు ఏవీ అంటే ఠక్కున ఐఐటీలు, ఎన్‌ఐటీలే గుర్తుకువస్తాయి. అక్కడ సీటు వస్తే చాలు జీవితం సెటిలైనట్లేనని ప్రతీ విద్యార్థి కలలు కంటుంటాడు.

కోర్సులు పూర్తికాగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలల్లోనే లక్షల ప్యాకేజీతో విద్యార్థులు అడుగులు బయటపెడుతుంటారు. ఐఐటీలో గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేశాడు అని ప్రొపైల్‌లో మెన్షన్‌ చేసి ఉంటే చాలు.. కంపెనీలు కళ్లకు అద్దుకొని వారికి ఆహ్వానం పలుకుతాయి. కానీ, ప్రస్తుతం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ సాచ్స్‌ (జీఎస్‌) గ్రూప్‌ దాదాపు 3,200 మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసింది. వారిలో ఖరగ్‌ పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్‌మన్‌  సాచ్స్‌ పింక్‌ స్లిప్‌లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్ మన్‌ సాచ్స్‌లో జాబ్‌ ఎక్స్‌పీరియన్స్‌, తొలగింపులపై లింక్డిఇన్‌లో తన బాధను ఇలా షేర్‌ చేశారు.

‘వావ్‌ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా జాయిన్‌ అయ్యా. నా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్‌ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్‌కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్‌లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్‌ పోయింది కాబట్టి..  కొత్త జాబ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్‌ఇన్‌ లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

IT Crisis

ఇలా సాహూయే కాదు.. గోల్డ్ మెన్‌  సాచ్స్‌ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్‌1 బీ వీసా హోల్డర్‌ ఉద్యోగులు కొత్త జాబ్‌ కోసం ప్రయత్నిస్తూ సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్‌ ప్రాంతంలో ఉన్న జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. 

‘విదేశాలలో మాస్టర్స్‌ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నన్ను చూసి మా కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్‌ కోస్టర్‌గా మారింది. నేను ఎక్కడ నుంచి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్‌లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్‌  పోస్ట్‌లో చెప్పారు.

Published date : 13 Jan 2023 01:18PM

Photo Stories