Inspirational Success Story : కంటి చూపులేకపోతేనేం... 47 లక్షలతో జాబ్ కొట్టాడిలా..
ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన యశ్.. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి రూ.47 లక్షల వేతనంతో ఎంపికై సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో యశ్ సక్సెస్ స్టోరీ మీకోసం...
8 ఏళ్లకే అంధత్వం...
మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌కు చెందిన యశ్ సొనాకియా పుట్టుకతోనే గ్లూకోమాతో బాధపడుతున్నాడు. చిన్ననాటి నుంచే కంటి చూపు నెమ్మదిస్తూ వచ్చింది. తనకు 8 ఏళ్లు రాగానే కంటి చూపు పూర్తిగా కోల్పోయాడు. కానీ, ఏ రోజు తన లోపం తన లక్ష్యానికి అడ్డుగా నిలువలేదు.
Success Story: నాడు పశువులకు కాపల ఉన్నా.. నేడు దేశానికి కాపల కాసే ఉద్యోగం చేస్తున్నా.. ఇందుకే..
క్యాంటీన్‌తోనే కుటుంబ పోషణ
25 ఏళ్ల యశ్ సొనాకియా తండ్రి యశ్‌పాల్ ఇండోర్ నగరంలో ఓ చిన్న క్యాంటీన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. కంటి సమస్యతో బాధపడుతున్న యశ్ తన అయిదో తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలో విద్యనభ్యశించాడు. కంటిచూపు పూర్తిగా కోల్పోయిన తర్వాత తన తండ్రి యశ్‌పాల్ తనను సాధారణ పాఠశాలలోనే చేర్పించాడు.
IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్ సాయంతో విద్యాభ్యాసం
యశ్ ఇండోర్‌లోని శ్రీ గోవింద్రం సెక్సారియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎస్‌జీఎస్‌ఐటీఎస్) కాలేజీలో 2021లో తన బీటెక్‌ని పూర్తి చేశాడు. తర్వాత కోడింగ్‌లో శిక్షణ పూర్తి చేసి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యాడు. మైక్రోసాఫ్ట్ ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ యేడాది సెప్టెంబర్‌లో బెంగళూర్‌లోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆఫర్ లెటర్‌లో కంపెనీ పేర్కొంది. స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో తన విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు, చదువుకునే సమయంలో తన చెల్లెలు సహాయం చేసేదని, సైన్స్, గణితంలో చాలా హెల్ప్ చేసేదని యశ్ తెలిపాడు.