The great resignation: ఒకరి తర్వాత మరొకరు.. ఐటీ కంపెనీలను వీడుతున్న సీనియర్లు.. ఐటీ రంగంలో ఏం జరుగుతోంది.?
20 ఏళ్ల పాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసి, సీఈఓ స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా పదవిని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఏడాదిలో ఇప్పటివరకు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహేంద్ర, విప్రోలకు చెందిన తొమ్మిది మంది ఉన్నతోద్యోగులు.. అంతర్జాతీయ ఐటీ సంస్థలు లేదా భారత్‌లోని ఇతర ఐటీ కంపెనీల్లోకి సీఈఓలుగా వెళ్లిపోయారు. గత ఏడాది దేశీయ ఐటీ పరిశ్రమ ఆరుగురు కొత్త సీఈవోలను చూసింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 10 మంది కొత్త సీఈవోలు వచ్చారు.
ఇవీ చదవండి: ఇకపై రోగులు విసిగించినా, దురుసుగా ప్రవర్తించినా వైద్యం బంద్...
ఇన్ఫోసిస్ మాజీ హెచ్‌ఆర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వెళ్లిపోయారు. అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ చార్లెస్ సలామే రాజీనామా చేసిన కేవలం రెండు రోజుల్లోనే లోబో కూడా గుడ్‌బై చెప్పారు. ఇంతకుముందు టీసీఎస్ సీఈవో పదవి నుంచి రాజేశ్ గోపీనాథన్, ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్స్ హోదాల నుంచి రవికుమార్, మోహిత్ జోషీలు తప్పుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: ట్రావెల్ ఏజెంట్లకు ఫుల్ డిమాండ్... ఈ మూడు నగరాల్లో వారికి కాసుల పంటే..!
కంపెనీలో అత్యున్నతపదవిలో కంటే ఇతర సంస్థల్లో మెరుగైన అవకాశాలు రావడంతో వెళ్లిపోయేందుకే మొగ్గుచూపుతున్నారు. మోహిత్ జోషి ఇన్ఫోసిస్‌లో 20 ఏండ్లకుపైగా పనిచేశారు. ఆయనకు టెక్ మహీంద్రా ఎండీ, సీఈవోగా అవకాశం వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 20న బాధ్యతలు చేపట్టనున్నారు. చార్లెస్ సలామే.. కెనడాకు చెందిన సంగోమా టెక్నాలజీస్ కార్పొరేషన్ కొత్త సీఈవోగా అవకాశాన్ని పొందారు. ఇక రవికుమార్ కాగ్నిజెంట్ సీఈవోగా నియమితులయ్యారు.
ఇవీ చదవండి: వీరికి షాకింగ్ న్యూస్.. 70 శాతం మార్కులు వస్తేనే.. లేకుంటే..?