violent patients: ఇకపై రోగులు విసిగించినా, దురుసుగా ప్రవర్తించినా వైద్యం బంద్... కొత్త నిబంధనలు తెలుసుకున్నారా..?
ఈ నేపథ్యంలో డాక్టర్లకు రక్షణ కల్పించే దిశగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) అడుగులు వేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ (NMCRMP) పేరుతో రూపొందించిన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. దీంతో ఇకపై వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స నిరాకరించవచ్చని వెల్లడించింది. వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ పేర్కొంది.
చదవండి: భారీగా మిగిలిపోతున్న మెడికల్ సీట్లు... ఈ సీట్లనైతే పట్టించుకునేవారే లేరు
ఇకపై కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ 2002 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ రెగ్యులేషన్ 2023 అమల్లోకి రానుంది. నూతన నిబంధనలోనూ రోగులకు సానుకూలాంశాలు ఉన్నాయి. వైద్యం ప్రారంభించడానికి ముందే రోగికి చికిత్స చేయడానికి ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని తప్పకతెలియజేయాలి. రోగికి ఏం వైద్యం చేసేది, అందుకు అయ్యే ఫీజు వివరాలను తెలియజేయాలి. అయితే ఫీజు చెల్లించలేని పక్షంలో డాక్టర్లు చికిత్స నిరాకరించవచ్చు.
చదవండి: తెలంగాణలో ఎంబీబీఎస్ ఫీజులు భారీగా పెంపు... బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే సీటు...
కేవలం ఎమర్జెన్సీ కేసుల విషయంలోనే తప్పనిసరిగా వైద్యం అందజేయాలి. అత్యవసర సమయంలో తప్పించి ఎవరికి చికిత్స అందించాలనేది పూర్తిగా డాక్టర్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఫార్మా సంస్థల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు, సౌకర్యాలు తీసుకోకూడదు. ఫార్మా సంస్థలు నిర్వహించే విద్యాసంస్థల్లో జరిగే వర్క్‌షాప్‌లు, సెమినార్‌ల్లో వైద్యులు పాల్గొనకూడదు. ఇకనుంచైనా రోగులు, వారి బంధువుల దాడులు డాక్టర్లపై ఆగుతాయా..?
చదవండి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూజీ మెడికల్ కోర్సుల్లో 10 శాతం కోటా...