Reservation in Medical Courses: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూజీ మెడికల్ కోర్సుల్లో 10 శాతం కోటా... ఎక్కడంటే
వైద్య విద్యలో ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూజీ మెడికల్ కోర్సుల్లో 10 శాతం కోటా ఇవ్వాలని పుదుచ్చేరి కేబినెట్ నిర్ణయించింది.
NEET counselling: సెంట్రలైజ్డ్ నీట్ కౌన్సెలింగ్ ప్రతిపాదనేదీ లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
కేంద్ర పాలిత ప్రాంతంలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎన్ రంగసామి నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
National Exit Test For MBBS: నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్.. పరీక్ష విధానం, ఈ పరీక్షతో ప్రయోజనాలు ఇవే..
అనంతరం రంగస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక ఆమోదం కోరినట్లు తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు ప్రభుత్వం వైద్య విద్యలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మరియు సమాజంలోని పేద వర్గాల నుండి కూడా ప్రయోజనం కోసం రిజర్వేషన్లు కోరుతూ అన్నాడీఎంకే ఇటీవల ముఖ్యమంత్రికి మెమోరాండం అందించింది.