Skip to main content

Clinical Psychology Courses : త్వ‌ర‌లోనే క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సుల ప్ర‌వేశం.. వైద్య‌రంగంలో వీరి పాత్ర కీల‌కం..

వైద్య రంగంలో ప్ర‌తీ ఒక డిపార్ట‌మెంట్ ముఖ్య‌మే. ఈ రంగంలో క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సులో ఎక్కువ శాతం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
AP to start clinical psychology courses in medical field soon

సాక్షి ఎడ్యుకేష‌న్: వైద్య రంగంలో ప్ర‌తీ ఒక డిపార్ట‌మెంట్ ముఖ్య‌మే. ఈ రంగంలో క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సులో ఎక్కువ శాతం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వైద్య సేవ‌లు అందించే ద‌శ‌లో క్లిన‌క‌ల్ సైకాల‌జీ కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే, ఏపీలో ప్ర‌స్తుతం ఈ కోర్సును ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ విష‌యంపై మాట్లాడారు మంత్రి సత్యకుమార్.

రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ కోర్సు ప్ర‌వేశ‌పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హమ‌ని, ఈ కోర్సు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణతోపాటు చికిత్సను కూడా అందిస్తుంద‌ని, క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు, తొలిసారిగా ఈ కోర్సు ప్ర‌వేశ పెట్ట‌డం సంతోషం అని తెలిపారు. 

Tech Layoffs: బాబూ జ‌ర‌జాగ్ర‌త్త‌.. టెక్‌ కంపెనీల్లో కొనసాగుతున్న‌ ఉద్యోగాల ఊచకోత..!

త్వ‌ర‌లోనే ప్ర‌వేశం..

రాష్ట్ర‌వ్యాప్తంగా క్లినిక‌ల్ సైకాల‌జీ కోర్సును ప్ర‌వేశ పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్లినికల్ సైకాలజిస్టులు దాదాపు లేరు. రాష్ట్రంలోనే కాక దాదాపు అన్ని చోట్లా క్లినికల్ సైకాలజీ కోర్సులు నిర్వహించక పోవడంతో వారి కొరత ఉంది. కాబ‌ట్టి, అతి త్వరలోనే రెండేళ్ల వ్యవధితో కూడిన ఎం.ఫిల్, ఒక ఏడాదిపాటు సాగే ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సుని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని, ఇందుకు త‌గిన‌ చర్యలు చేప‌డ‌తామ‌ని మంత్రి తెలిపారు.

AFCAT 2025 Hall Tickets Download : ఏఎఫ్‌సీఏటీ 2025 హాల్‌టికెట్ విడుద‌ల‌.. డౌన్‌లోడ్ విధానం.. ప్రిప‌రేష‌న్‌లో ఇవి పాటించండి..

క్లినికల్ సైకాలజీ విద్యను నియంత్రించే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో సంప్రదింపులు చేసి ఎంతో ఉపయోగకరమైన ఈ కోర్సుల్ని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. దీని వ‌ల‌న ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్ర‌తీఒక్క‌రికి క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర వహిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 11 Feb 2025 10:17AM

Photo Stories