NEET counselling: సెంట్రలైజ్డ్ నీట్ కౌన్సెలింగ్ ప్రతిపాదనేదీ లేదు: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Sakshi Education
మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి 2023-24 సంవత్సరానికి కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. వివిధ కోటాల కింద సీట్ల కేటాయింపు విధానంలోనూ మార్పు లేదని వివరించారు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 15% సీట్లే అఖిలభారత కోటాలో ఉంటాయని స్పష్టంచేశారు. అలాగే 2020 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 12 వైద్య కళాశాలలకు గుర్తింపునిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌పవార్ లోక్‌సభలో తెలిపారు. కేంద్రమంత్రి సమాధానంతో ప్రస్తుతం ఉన్న సీట్ల కేటాయింపు విధానంలో ఎలాంటి మార్పులు లేనట్లేనని స్పష్టమవుతోంది.
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య కోర్సుల సీట్లకు సంబంధించి ప్రతీ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. నీట్ యూజీ, నీట్ పీజీలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది.
Published date : 24 Jul 2023 05:18PM