National Exit Test For MBBS: నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్.. పరీక్ష విధానం, ఈ పరీక్షతో ప్రయోజనాలు ఇవే..
- నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నిర్వహణకు ఎన్‌ఎంసీ నిర్ణయం
- ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ బదులుగా నెక్స్›్ట
- 2025 నుంచి నిర్వహించే అవకాశం
- ప్రాక్టీస్ లైసెన్స్, పీజీ ప్రవేశాలకూ నెక్స్›్టలో ఉత్తీర్ణతే మార్గం
- అందుబాటులో నెక్స్›్ట-1.. మాక్ టెస్ట్‌లు
ప్రస్తుతమున్న విధానం ప్రకారం-దేశంలో ఎంబీబీఎస్ కోర్సుల విద్యార్థులు యూనివర్సిటీలు నిర్వహించే ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే పీజీ కోర్సుల కోసం నీట్-పీజీలో అర్హత పొందాలి. అదే విధంగా విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. భారత్‌లో ఉన్నత విద్య, ప్రాక్టీస్‌కు అనుమతి కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించాలి. ఎంబీబీఎస్ అభ్యర్థులు ఇలా అనేక పరీక్షలకు హాజరయ్యే బదులు.. 'ఉన్నత' అవకాశాలన్నింటినీ.. ఒకే పరీక్ష ద్వారా సాకారం చేసుకునేందుకు ఎన్‌ఎంసీ ప్రతిపాదించిన పరీక్ష.. నెక్స్›్ట.
మార్గదర్శకాలు ఇలా
- నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌కు సంబంధించి ఎన్‌ఎంసీ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. 'ఎన్‌ఎంసీ, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రెగ్యులేషన్స్-2023' పేరుతో నియమ, నిబంధనలను పేర్కొంటూ.. గెజిట్ ప్రకటన ఇచ్చింది.
- ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం-ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని భారత్‌లో ప్రాక్టీస్, అలాగే ఉన్నత విద్యలో అడుగు పెట్టాలనుకుంటున్న విద్యార్థులు.. పీజీ మెడికల్ కోర్సుల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులు.. వీరంతా నెక్స్›్టలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- అంటే.. ఇకపై ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండవు, నీట్-పీజీ ఎంట్రన్స్ ఉండదు, ఎఫ్‌ఎంజీఈ కూడా ఉండదు. ఈ మూడు పరీక్షలకు బదులు ఒకే ఒక పరీక్ష నెక్స్›్టలో నెగ్గితే సరిపోతుందని ఎన్‌ఎంసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
చదవండి: NEET 2023 Counselling: మెడికల్ కౌన్సెలింగ్‌కు సిద్ధమా... స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్!
వచ్చే ఏడాది నుంచే.. కానీ వాయిదా
- ఎన్‌ఎంసీ తాజా మార్గదర్శకాల ప్రకారం-వచ్చే ఏడాది(2024) నుంచే నెక్స్›్ట పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. అంటే.. ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫైనల్‌లో ఉన్న విద్యార్థులు.. ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, ఉన్నత విద్య, ప్రాక్టీస్‌కు అనుమతి కోసం నెక్స్›్టలో ఉత్తీర్ణత సాధించేలా నిబంధనలను విడుదల చేశారు.
- కాని ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో.. నెక్స్›్ట-2024ను ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ ఏడాది ఫైనలియర్‌లో ఉన్న వారు నెక్స్›్ట రాయనక్కర్లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ మూడో సంవత్సరంలో ఉన్న విద్యార్థులు.. 2025లో నెక్స్›్ట రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
స్టెప్-1, స్టెప్- 2గా
- నెక్స్›్టను నెక్స్›్ట-1, నెక్స్›్ట-2 పేరుతో రెండు దశలుగా నిర్వహించనున్నారు.
- నెక్స్›్ట స్టెప్-1.. ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి థియరీ ఎగ్జామ్‌గా ఉంటుంది.
- నెక్స్›్ట స్టెప్-1లో ఉత్తీర్ణతతోపాటు.. ఎంబీబీఎస్ తర్వాత ఇంటర్న్‌షిప్(ఏడాది వ్యవధిలో ఉండే) పూర్తి చేసుకున్న వారికి నెక్స్›్ట స్టెప్-2కు అర్హత లభిస్తుంది.
ఏటా రెండుసార్లు
- నెక్స్›్ట ఎగ్జామ్‌ను ప్రతి ఏటా రెండుసార్లు.. మే, నవంబర్‌ల్లో నిర్వహిస్తారు. ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు.. ఎన్నిసార్లయినా నెక్స్›్టకు హాజరుకావచ్చు. నెక్స్›్ట స్టెప్-2లో ఉత్తీర్ణత సాధించాక.. నెక్స్›్ట స్టెప్-1లో స్కోర్ పెంచుకునేందుకు.. స్టెప్-1 పరీక్షను మళ్లీ రాయొచ్చు.
- నెక్స్›్ట స్టెప్-2లో..సప్లిమెంటరీ ఎగ్జామ్ విధానం అమలు చేస్తారు. స్టెప్-2 పరీక్షకు పేర్కొన్న ఏడు సబ్జెక్ట్‌లలో.. ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయిన వారు స్టెప్-2 సప్లిమెంటరీకి హాజరు కావచ్చు.
- స్టెప్-2లో మూడు కంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో ఫెయిలైతే మాత్రం.. స్టెప్-2 సప్లిమెంటరీ పరీక్షలో మొత్తం ఏడు సబ్జెక్ట్‌లకు హాజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
చదవండి: AP Medical Seats 2023 : ఈ వైద్య కళాశాలల్లో 35% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు.. మిగిలినవి మాత్రం..
50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- నెక్స్›్ట స్టెప్-1, స్టెప్-2 పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పీజీ ప్రవేశాలకు నెక్స్›్ట స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోనున్న క్రమంలో.. నెక్స్›్ట స్టెప్-1 స్కోర్‌కు అయిదేళ్ల పాటు గుర్తింపు ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు స్టెప్-1కు హాజరైతే.. తాజా స్కోర్‌ను మాత్రమే పీజీ ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు.
- నెక్స్›్ట ద్వారా ఎంబీబీఎస్ అభ్యర్థులు సొంతం చేసుకున్న థియరీ, ప్రాక్టికల్ నైపుణ్యాలను తెలుసుకునేలా పరీక్ష ఉంటుంది. నెక్స్›్ట స్టెప్-1ను థియరీ పరీక్షలుగా, నెక్స్›్టస్టెప్-2ను ప్రాక్టికల్ పరీక్షలుగా నిర్వహించనున్నారు.
నెక్స్›్ట స్టెప్-1.. ఆరు పేపర్లుగా
- నెక్స్›్ట స్టెప్-1 పరీక్షను ఎంబీబీఎస్ మూడో సంవత్సరం, అదే విధంగా ఎంబీబీఎస్ ఫైనల్ పార్ట్-1, పార్ట్-2లలోని సబ్జెక్ట్‌ల నుంచి నిర్వహిస్తారు. నెక్స్›్ట స్టెప్-1 సబ్జెక్టుల వివరాలు..- మెడిసిన్ అండ్ అల్లైడ్ సబ్జెక్ట్స్ 120 ప్రశ్నలు-పరీక్ష సమయం 3 గంటలు; సర్జరీ అండ్ అల్లైడ్ సబ్జెక్ట్ 120 ప్రశ్నలు-పరీక్ష సమయం 3 గంటలు; ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 120 ప్రశ్నలు-పరీక్ష సమయం 3 గంటలు; పిడియాట్రిక్స్ 60 ప్రశ్నలు-పరీక్ష సమయం 1.5 గంటలు; అటోర్నినోలరీగాలజీ 60 ప్రశ్నలు-పరీక్ష సమయం 1.5 గంటలు; ఆప్తాల్మాలజీ 60 ప్రశ్నలు- పరీక్ష సమయం 1.5 గంటలుగా ఉంటుంది.
- పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.
ప్రాక్టికల్.. క్లినికల్ నైపుణ్యాలు
నెక్స్›్ట స్టెప్-2 పరీక్ష.. ప్రాక్టికల్, క్లినికల్ నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటుంది. ఈ పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం ఏడు సబ్జెక్ట్‌లలో విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలిస్తారు. అవి.. » మెడిసిన్ అండ్ అల్లైడ్ సబ్జెక్ట్స్ » సర్జరీ అండ్ అల్లైడ్ సబ్జెక్ట్స్ » ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ » పిడియాట్రిక్స్ » అటోర్నినోలరీగాలజీ » ఆప్తాల్మాలజీ » ఆర్థోపెడిక్స్ అండ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్. » వీటితోపాటు వైవా-వోస్ పేరిట మౌఖిక పరీక్ష కూడా నిర్వహిస్తారు.
చదవండి: New Medical College in Telangana: 2023 నుంచే ఎంబీబీఎస్ ప్రవేశాలు!
నెక్స్›్టపై.. భిన్నాభిప్రాయాలు
నెక్స్›్టపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎంబీబీఎస్‌కు ఉమ్మడి ఫైనల్ పరీక్షగా నెక్స్›్టను నిర్వహించాలనే నిర్ణయంపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు.. నెక్స్›్ట కారణంగా జాతీయ స్థాయిలో పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో నష్టపోతామనే అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది. నీట్-పీజీ స్థానంలో నెక్స్›్ట స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకునే నిర్ణయంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నీట్-పీజీ పరీక్ష విధానాన్ని, క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలోనే నెక్స్›్టపేపర్‌ను రూపొందిస్తారని, కాబట్టి ఇందులో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారుతుందనే వాదనా వినిపిస్తోంది.
కొత్త విధానానికి మళ్లడం కష్టంగా
ఇప్పటి వరకు తాము యూనివర్సిటీ స్థాయి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని సన్నద్ధత పొందుతున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే నెక్స్›్ట స్టెప్-1ను నిర్వహిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. అదే విధంగా.. నీట్-పీజీ కోసం మూడో ఏడాది నుంచే కష్టపడుతున్నామని.. ఇలాంటి తరుణంలో నెక్స్›్టను నిర్వహిస్తే.. ఒక్కసారిగా అభ్యసన విధానాన్ని మార్చుకోవడం కష్టంగా ఉంటుందని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు.
నెక్స్›్ట క్యాలెండర్ ఇలా
- నెక్స్›్ట స్టెప్-1 పరీక్ష: మే, నవంబర్‌లలో
- ఫలితాలు: జూన్, డిసెంబర్ మొదటి వారంలో
- నెక్స్›్ట స్టెప్-2 పరీక్ష: జూన్, డిసెంబర్ మూడో వారంలో
- ఫలితాలు: జూన్, డిసెంబర్ నాలుగో వారంలో
- పీజీ ప్రవేశాలు: మే లేదా జూన్‌లో కౌన్సెలింగ్