Top Don'ts for NEET 2024: నీట్ కి ప్రిపేర్ అవుతున్నారా... ఇవి అస్సలు చేయకండి!
మీ విజయావకాశాలను పెంచుకోవడానికి, మీ ప్రిపరేషన్ సమయంలో ఏవేవి చేయకూడదో తెలుసుకోవడం ముఖ్యం. నీట్ 2024 ప్రిపరేషన్ కోసం ఇక్కడ కొన్ని "చేయకూడనివి" మీ కోసం:
వాయిదా వేయడం:
మీ ప్రేపరషన్ సెషన్ ను వాయిదా వేయకండి. NEET సన్నద్ధతలో స్థిరత్వం కీలకం... మీ ప్రేపరషన్ షెడ్యూల్‌ను వాయిదా వేయడం వలన మీకు అంతరాలు ఏర్పడవచ్చు.
100 MBBS seats per 10 lakh population:10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు..
NCERTని విస్మరించడం:
NCERT పాఠ్యపుస్తకాలను నిర్లక్ష్యం చేయవద్దు. NEET ప్రాథమికంగా NCERT సిలబస్‌పై దృష్టి పెడుతుంది, కాబట్టి ఈ పుస్తకాలను పూర్తిగా అర్థం చేసుకుని రివైజ్ చేస్తూ ఉండండి.
మాక్ టెస్ట్‌లను పట్టించుకోకపోవడం:
మాక్ టెస్ట్‌ల ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయకండి. పరీక్షా సరళితో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి, సమయ నిర్వహణను మెరుగుపరచడానికి ... వీక్ ఏరియాస్ ను గుర్తించడానికి మాక్ టెస్ట్‌లను క్రమం తప్పకుండా రాయండి.
రివిజన్ ను నిర్లక్ష్యం చేయడం:
నేర్చుకున్న అంశాలను రివిజన్ చేసుకోడం మర్చిపోకండి. రెగ్యులర్ రివిజన్ మీ అవగాహనను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
NEET UG 2024: నీట్-యూజీ-2024 పరీక్ష విధానం.. బెస్ట్ ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్..
ఒంటరిగా ఉండడం:
స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి మీరు దూరంగా ఉండకండి. ప్రేపరషన్ కి సమయం కేటాయించడం ముఖ్యం అయినప్పటికీ, తరచూ మీ శ్రేయోభిలాషులతో మాట్లాడుతూ ఉండడం మీ మానసిక శ్రేయస్సుకు కీలకం.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం:
మీ ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి. తగినంత నిద్ర, సరైన పోషకాహారం... క్రమం తప్పకుండా వ్యాయామం ఏకాగ్రతకు దోహదం చేస్తాయి.
వీక్ ఏరియాస్ ను విస్మరించడం:
మీరు సవాలుగా భావించే వీక్ టాపిక్స్ ను నిర్లక్ష్యం చేయొద్దు. ఆ అంశాలను మెరుగుపరచడానికి తగినంత సమయాన్ని కేటాయించండి.
కంఠస్థంకు అధిక ప్రాధాన్యత:
కంఠస్థం మీద మాత్రమే దృష్టి పెట్టవద్దు. అప్లికేషన్ ఆధారిత పరిజ్ఞానాన్ని పెంచుకుని పూర్తిగా అర్థం చేసుకోండి.
ఒకే ఒక మెటీరియల్ పై ఆధారపడటం:
అంశాల గురించి చక్కటి అవగాహన పొందడానికి వివిధ పుస్తకాలు, ఆన్‌లైన్ మెటీరియల్‌లు, కోచింగ్ వనరులను ఉపయోగించుకోండి.
టైం మానేజ్మెంట్ ను విస్మరించడం:
పరీక్ష సమయంలో సమయ పాలన ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకండి. NEET పరీక్ష రోజున మీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కేటాయించిన సమయంలో ప్రశ్నలకు సమాధానాలను ఎంచుకోడానికి ప్రాక్టీస్ చేయండి.
ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు... స్మార్ట్ స్ట్రాటజీలతో ప్రిపేర్ అయితే NEET పరీక్షలో మీరు విజయం సాధించడం సులువే.
NEET 2023 Seat Allotments: MBBS రౌండ్-1 కటాఫ్ ర్యాంకులు ఇవే!