Travel agent: ట్రావెల్ ఏజెంట్లకు ఫుల్ డిమాండ్... ఈ మూడు నగరాల్లో వారికి కాసుల పంటే..!
తాజాగా విడుదలై నివేదిక ప్రకారం... కరోనా మహమ్మారి తర్వాత భారతదేశం ట్రావెల్ అండ్ టూరిజం పరంగా భారీ గ్రోత్ సాధించింది. 2022 జూన్ నుంచి 2023 వరకు ఆతిథ్య రంగంలో ఉద్యోగాల కల్పన 66% పెరిగింది. అదే 2019-20 మధ్య ఉద్యోగ కల్పనలో 60% క్షీణత నమోదైంది. 2020-21లో ఈ క్షీణత 7%గా నమోదైంది.
ఇవీ చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా?.. గ్రూప్–2 పరీక్ష వాయిదా?
మారుతున్న జీవన ప్రమాణాలు, వ్యక్తుల ప్రాధాన్యతలను బట్టి టూరిజం రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ట్రావెలింగ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము వెళ్లిన ప్రదేశాలను సోషల్ మీడియా ద్వారా పదిమందితో పంచుకుంటున్నారు. తత్ఫలితంగా మరికొంతమంది ఆ ప్రదేశాలను విజిట్ చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నారు.
ఇవీ చదవండి: ఈ ఉద్యోగం కోసం 10 లక్షల మంది దరఖాస్తులు.. జీతం మాత్రం రూ.25,500
ఈ మధ్యకాలంలో సోలో ట్రావెలింగ్ బాగా పాపులరైంది. సింగిల్ వచ్చే పర్యాటకులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు అనేక ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. దీంతో ట్రావెల్ ఏజెంట్స్‌కు ఉపాధి లభిస్తోంది. ఇండీడ్ విడుదల చేసిన డేటా ప్రకారం... ఆతిథ్యరంగంలో అత్యధికంగా ట్రావెల్ ఏజెంట్ ఉద్యోగాల డిమాండ్ ఉన్న నగరాల్లో ఢిల్లీ (33%), ముంబై (6%), బెంగళూరు (5%) తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. మొహాలీ, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ 4 శాతం చొప్పున డిమాండ్ పెరుగుతోంది.
ఇవీ చదవండి: అచ్చం విద్యార్థుల్లాగే యూనిఫాం ధరిస్తోన్న టీచర్...