Skip to main content

Salary Hike News : 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. ఈ రంగాల్లోని వారికే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు WTW Salary Budget Planning Report వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కింది స్టోరీలో చూడొచ్చు.
WTW Salary Budget Planning Report 2024, Indian Employee Salary Rise,Salary Increment Prediction in India 2024, Asia Pacific Salary Trends 2024,

జీతాల పెరుగుదల మాత్రం..
భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది.

అంతే కాకుండా..

salary hike

రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది.

Published date : 03 Nov 2023 09:14AM

Photo Stories