Skip to main content

Twitter: ఆగ‌ని తొల‌గింపుల ప‌ర్వం... ఈసారి 200 మంది జౌట్

ఎలాన్‌మ‌స్క్... బహుశా ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు అంటే ఏ మాత్రం అతిశ‌యోక్తి కాదు. ప్ర‌పంచ కుబేరుల్లో నంబ‌ర్ 1 స్థానంలో ఉన్న మ‌స్క్ తీవ్ర వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉద్యోగుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటున్నాడు.
Elon Musk

ట్విట్ట‌ర్‌ను టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత సగం మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపినా.. ఇప్ప‌టికీ ఆ ప‌ని ఆప‌డం లేదు. తాజాగా మ‌రికొంద‌రికి ఉద్వాస‌న పలికి ఉద్యోగుల గుండెల్లో అల‌జ‌డి రేపాడు.
200 మంది తొల‌గింపు...
ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ట్విటర్ సంస్థ మరో సారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ సారి మరో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఇందులో ప్రొడక్ట్ మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.
ఇన్‌చార్జుల‌ను తీసిపారేస్తూ....
కంపెనీ ఈ తొలగింపులు గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ ట్విట్టర్ బ్లూ ఇన్‍చార్జ్‌గా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ పేరు కూడా తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ట్విటర్ సంస్థలో 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని గత నెలలో ఎలాన్ మస్క్ తెలిపారు.

చ‌ద‌వండి: ఇండియానూ తాకిన లేఆఫ్స్‌... వందలమందిని తొలగించిన గూగుల్
గ‌తేడాది 3,700 మంది... 
తాజా నివేదికల ప్రకారం, 200 మంది తొలగింపు నిజమయితే ఎలాన్ మ‌స్క్ ప్రకటించిన సంఖ్య ఇంకా తగ్గుతుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఏకంగా 3,700 మంది ఉద్యోగులను తొలగించారు. ఆ సమయంలో, కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, కంపెనీ ఎదుర్కొనే నష్టాలను కూడా అదుపు చేయడానికి ఉద్యోగులను తొలగించినట్లు మస్క్ ప్రకటించారు.
తొల‌గింపులు ఉండ‌వ‌ని....
గత ఏడాది నుంచి ఉద్యోగులను తొలగిస్తున్న ఎలాన్ మస్క్ కొన్ని సార్లు ఇక ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు. అయితే అది నిజం కాదని ఇప్పుడు స్పష్టమైంది. ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో టెక్ కంపెనీలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

చ‌ద‌వండి:​​​​​​​ హాఫ్‌ జీతానికే ప‌నిచేయండి... లేదంటే.. ప్రెష‌ర్స్‌కు ఐటీ కంపెనీ షాక్‌

Published date : 27 Feb 2023 01:35PM

Photo Stories