Skip to main content

TU Girls Hostel : త్వ‌ర‌లోనే తెలంగాణ యూనివర్సిటీలో గ‌ర్ల్స్ హాస్ట‌ల్ నిర్మాణ ప‌నులు ప్రారంభం

యూనివర్సిటీలు, ఉన్నత విద్యా కళాశాలల్లో అమ్మాయిల భద్రతపై నియమించిన యూజీసీ కమిటీ ఆయా విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై 2002 నవంబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది.
Girls hostel construction in university to be started soon

తెయూ: తెలంగాణ యూనివర్సిటీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండవ బాలికల (గర్ల్స్‌) హాస్టల్‌ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవలే టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో టెండర్‌ ఖరారుకాగా, కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

తెయూ మెయిన్‌ క్యాంపస్‌ లో 2008–09 లో గర్ల్స్‌ హాస్టల్‌ ప్రారంభించారు. ప్రతి యేటా పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, ఎల్‌ఎల్‌బీ కోర్సులలో బాలుర కంటే బాలికల ప్రవేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. బాలురకు రెండు హాస్టల్స్‌ ఉండగా బాలికలకు మా త్రం ఒకటే హాస్టల్‌ ఉంది. దీంతో ఉన్న ఒక్క హాస్టల్‌లో బాలికలు కిక్కిరిసి తలదాచుకోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో ఇద్దరు, ముగ్గురు ఉండాల్సి ఉండగా గదులు సరిపోక ఆరుగురి నుంచి ఎనిమిది మంది ఉంటున్నారు. దీంతో బాలికలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా రెండవ గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించాలని ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు హాస్టల్‌ నిర్మాణానికి టెండర్‌ ఖరారు కావడంతో యూనివర్సిటీలోని బాలికలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

● యూనివర్సిటీలో నూతన గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి రూసా రూ.7 కోట్లు నిధులు మంజూరు చేసింది. నిధులు మే నెలలో మంజూరయ్యాయి. అయితే అప్పట్లో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో టెండర్‌ పిలువలేక పోయారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవలే తెలంగాణ యూనివర్సిటీకి నూతన వైస్‌చాన్స్‌లర్‌గా యాదగిరి రావు నియామకమయ్యారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి కావడంతో వారం రోజుల్లో గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హాస్టల్‌ పూర్తయితే విద్యార్థులకు ఇబ్బందులు తీరుతాయి.

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం

యూనివర్సిటీలు, ఉన్నత విద్యా కళాశాలల్లో అమ్మాయిల భద్రతపై నియమించిన యూజీసీ కమిటీ ఆయా విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై 2002 నవంబర్‌లో మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా గర్ల్స్‌ హాస్టళ్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించాలని, క్యాంటీన్‌, మెస్‌ హాల్‌, పరిశుభ్రమైన టాయిలెట్లు, వాషింగ్‌ మెషిన్లు, వై–ఫై సౌకర్యం, ఇండోర్‌ గేమ్స్‌, రీడింగ్‌ గదులు వంటి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Medical College: 5న మెడికల్‌ కాలేజీ భవనాలకు శంకుస్థాపన

విద్యార్థినులు ప్రవేశం పొందే సమయంలోనే హెల్ప్‌లైన్‌ నంబర్లు, స్టూడెంట్‌ కౌన్సిలర్లు, యాంటీ ర్యాగింగ్‌ సెల్‌, అత్యవసర వైద్యం, ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్‌ తదితర పూర్తి వివరాలతో హ్యాండ్‌ బుక్‌ ముద్రించి అందించాలని సూచించింది. బాలికల రక్షణకు అనుకూలమైన, సురక్షితమైన ప్రాంగణాలు తీర్చిదిద్దాలని కోరింది. విశ్వసనీయత ఉన్న సెక్యూరిటీ సంస్థల నుంచి తగినంత మహిళా భద్రతా సిబ్బందిని నియమించాలని పేర్కొంది. ఇలా మొత్తం 28 రకాల చర్యలు చేపట్టాలని యూజీసీ సూచించింది. యూజీసీ ఆదేశాల మేరకు ప్రస్తుతం వర్సిటీలో రెండవ గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మాణానికి మోక్షం లభిస్తోంది.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Nov 2024 03:23PM

Photo Stories