Skip to main content

Cisco layoffs 2024: భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీ.. కారణమిదేనా?

Cisco layoffs 2024

ప్రపంచంలోనే అగ్రగామి నెట్‌వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ సిస్కో, ఈ ఏడాది మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.

2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో ఇంటికి పంపింది. అయితే సిస్కో తన నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగష్టు 14న వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

Teacher jobs: గురుకులాల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు అర్హులు

డిమాండ్, సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా కంపెనీ కొన్ని కఠినమైన సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ మళ్ళీ ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సారి ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది, ఏ విభాగం నుంచి తొలగిస్తుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

cisco layoffs

Faculty Jobs: వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

ఇదిలా ఉండగా.. సిస్కో కంపెనీ ఏఐ రంగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ 2025 నాటికి మరింత వృద్ధి చెందటానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ వ్యూహంలో వారి ప్రధాన ఉత్పత్తులలో AI-ఆధారిత పరిష్కారాలను అందించడం, 1 బిలియన్ పెట్టుబడుల ద్వారా AI స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి.

Published date : 10 Aug 2024 03:55PM

Photo Stories