Skip to main content

Teacher jobs: గురుకులాల్లో అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. వీళ్లు అర్హులు

Faculty Jobs Gurukula School teaching posts  Applications invited for teaching positions at Dr. BR Ambedkar Gurukula School/Colleges S. Rupavathy announces vacancies for teaching posts in Anakapalli district Dr. BR Ambedkar Gurukula School/Colleges job openings in Anakapalli  Teaching and teacher vacancies at Dr. BR Ambedkar Gurukula School/Colleges

సబ్బవరం : అనకాపల్లి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల /కళాశాలల్లో పలు సబ్జెక్టుల్లో బోధించడానికి ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎస్‌.రూపావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్‌, నకలు ధ్రువపత్రాలతో ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు సబ్బవరంలోని డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో నిర్వహించే డెమో తరగతులకు హాజరుకావాలన్నారు.

Faculty Jobs: వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే

ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో ప్రోస్టు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పాటు బీఈడి, టెట్‌ అర్హత కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా బాలుర పాఠశాలలకు పురుష అభ్యర్థులను, బాలికల పాఠశాలకు మహిళా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, విద్యా బోధనలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.

IT Jobs: ఐటీలో నియామకాల సందడి!.. వీరికి డిమాండ్‌ ఎక్కువ

పూర్తి వివరాలకు ఉమ్మడి జిల్లాల సమన్వయ అధికారి కార్యాలయాన్ని ఫోన్‌ :0891 2799641 నంబర్‌లో సంప్రదించాలన్నారు. దేవరాపల్లి బాలుర గురుకుల పాఠశాలలో జేఎల్‌ తెలుగు, కొక్కిరాపల్లి బాలికల గురుకుల పాఠశాలలో జేఎల్‌ జువాలజీ, కోనాం బాలికల గురుకుల పాఠశాలలో జేఎల్‌ కెమిస్ట్రీ , నర్సీపట్నం బాలికల గురుకులంలో పీజీటీ సోషల్‌ సబ్జెక్టు పోస్టులతో పాటు గొలుగొండ బాలుర గురుకులంలో పీడీ, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
 

Published date : 10 Aug 2024 03:39PM

Photo Stories