Ed Tech Startup Companies : కోవిడ్ తర్వాత పెరిగిన ఆన్‌లైన్ కోర్సులు.. గత రెండేళ్లలో దేశంలో దాదాపు 4,500 ఎడ్ టెక్ స్టార్టప్స్
సాక్షి ఎడ్యుకేషన్: కోవిడ్–19 పరిణామాలతో విద్యార్థులు ‘ఆన్‌లైన్’ బాట పట్టారు. అమెరికా తర్వాత భారత్‌లోనే ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయి. ఆ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి సంప్రదాయ క్లాస్‌రూమ్ శిక్షణ వైపు మళ్లారు. దీంతో ఆయా కంపెనీలు సైతం ‘ఆఫ్‌లైన్’ సేవల్లోకి అడుగుపెట్టాయి.
AP NIT Second Phase : ఏపీ నిట్‌లో రెండో దశ పనులకు నిధులు.. త్వరలో జారీ కానున్న ఉత్తర్వులు..
దేశంలో 2014 నుంచి 2020 వరకు ఎడ్ టెక్ రంగం విలువ 1.32 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే కరోనా, లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ–లెర్నింగ్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఒక్క 2020లోనే ఈ రంగం 1.88 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. 2020–21 మధ్య కరోనా విస్తరణతో దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ రెండేళ్లల్లో దేశంలోని దాదాపు 320 మిలియన్ల మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు.
ఆ సమయంలో ఆన్‌లైన్ తరగతులు, ఈ–లెర్నింగ్ సాఫ్ట్‌వేర్, వర్చువల్ ట్యుటోరియల్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి రంగాలు విస్తరించి, ఈ–కంటెంట్ అభివృద్ధికి పెద్ద నగరాలు కేంద్రాలుగా మారాయి. 2020 చివరి నాటికి వ్యాపార ప్రాథమిక, ఆర్థిక విశ్లేషణ, వృత్తిపరమైన కమ్యూనికేషన్స్ కోర్సుల డిమాండ్ 606 శాతం పెరిగినట్టు ఓఆర్‌ఎఫ్ పేర్కొంది.
Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ పతకాలు సాధించిన దేశాలివే! 2028 ఒలింపిక్స్ ఎక్కడంటే..
2021 నాటికి ఇండియా ఎడ్‌టెక్ బూమ్ తిరుగులేని ప్రగతిని నమోదు చేసిందని, ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఎడ్ టెక్ మార్కెట్‌గా నిలవడంతో పాటు స్టార్టప్ మార్కెట్ 2021లో 4.73 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది.
ఈ రెండేళ్లలో దేశంలో దాదాపు 4,500 ఎడ్‌టెక్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) వెల్లడించింది. భారతీయ ఎడ్ టెక్ కంపెనీలైన బైజూస్, స్కేలర్ అకాడమీ, ఎమెరిటస్, సింప్లిలెర్న్ వంటి సంస్థలు అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు విస్తరించాయి.
AP Medical Colleges: కొత్త వైద్య కళాశాలలకు పీపీపీ విధానం... ఫీజులు పెరిగే అవకాశం!
మళ్లీ ‘ఆఫ్‌లైన్’లోకి అడుగులు..
మన ఎడ్ టెక్ రంగం 2022 నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని ఓఆర్‌ఎఫ్ పేర్కొంది. పాఠశాలలు తిరిగి తెరవడం ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకునే బదులు హైబ్రిడ్, సంప్రదాయ లెర్నింగ్ విధానాల వైపు ఆసక్తి పెరగడంతో ఆన్‌లైన్ రంగంలో కొంత తడబాటు నెలకొందని వెల్లడించింది. దీంతో ఎడ్‌టెక్ కంపెనీలు తమ మార్కెట్‌ను కాపాడుకునేందుకు పోటీ పడుతున్నాయని, ఈ క్రమంలో కోర్సుల ధరలు, మార్జిన్లను తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో పెట్టుబడిదారులు ఈ రంగంలోకి దిగేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎడ్ టెక్ స్టార్టప్స్ నిధులు 2022లో 2.6 బిలియన్ డాలర్లు తగ్గిపోగా, 2023లో 0.297 బిలియన్ డాలర్లు తగ్గాయి.
అంతేగాక 2022లో ఈ రంగంలో ఉన్న 14 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మారిన పరిస్థితులు, పెరిగిన పోటీ రీత్యా భారత ఎడ్‌టెక్ సంస్థలు ఆన్‌లైన్ సేవల నుంచి ఆఫ్‌లైన్ సేవలు అందించడం మొదలెట్టాయి. ఈ కోవలోనే బైజూస్ 2021లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ ట్యుటోరియల్ సెంటర్ చైన్‌ను కొనుగోలు చేసింది. ఫిజిక్స్ వాలా సంస్థ కూడా గతేడాది ఆఫ్‌లైన్ సేవల్లోకి వచ్చిది.
2024 చివరి నాటికి భారం అంతటా 60కి పైగా విద్యాపీఠ్‌లు, పాఠశాలలు పేరు తో తెరవనున్నట్టు ప్రకటించింది. వీటితో పాటు బ్రైట్ క్యాంపస్, అన్ అకాడమీ వంటి సంస్థలు కూడా ఆఫ్‌లైన్ సేవల్లోకి ప్రవేశించాయి. జాతీయ విద్యావిధానం–2020 అమలు చేసి నాలుగేళ్లు పూర్తవడంతో ఎడ్ టెక్ రంగాలకు ప్రోత్సాహం ఉంటుందని, ఎడ్‌టెక్–కేంద్రీకృత ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యానికి విస్తృతమైన అవకాశాలు ఉంటాయని ఓఆర్‌ఎఫ్ అంచనా వేసింది.
Tags
- Ed Tech companies
- Online Classes
- Covid 19
- Startup companies
- students education
- education applications
- Byjus
- Online courses
- India
- America
- Ed Tech Startup Companies
- Schools and Colleges
- govt and private institutions
- Online Education
- Education News
- Sakshi Education News
- OnlineEducation
- Covid19Impact
- IndianEducationTech
- EdtechInvestment
- ObserverResearchFoundation
- EdtechGrowth
- RemoteLearning
- DigitalLearning
- EducationTrends
- SakshiEducationUpdates