Skip to main content

AP NIT B Tech Admissions : ఏపీ నిట్‌లో బీటెక్ ప్ర‌వేశాల‌కు సంద‌డి.. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు మాత్రం..

First-year BTech students at AP NIT collecting admission papers  B Tech admissions at Andhra Pradesh National Institute of Technology

తాడేపల్లిగూడెం: ఏపీ నిట్‌లో ప్రథమ సంవత్సర బీటెక్‌లో చేరడానికి విద్యార్థులు రావడంతో శనివారం సందడి నెలకొంది. ఏపీ నిట్‌లో ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రవేశ పత్రాలను సంబంధిత అధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. నిట్‌లో 480 సీట్లు ఉండగా, వీటిలో హోం స్టేట్‌ కోటా కింద 240, అదర్‌ స్టేట్‌ కోటా కింద 240 సీట్లను భర్తీ చేస్తారు.

JNTUK MBA and MCA Courses : జేఎన్‌టీయూకేలో స్పాన్స‌ర్డ్ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

2024–25 విద్యాసంవత్సరానికి 480 సీట్లు అలాటయ్యాయి. బీటెక్‌లో ఎనిమిది బ్రాంచ్‌లకు గాను ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లో చేరడానికి సర్టిఫికెట్లను తల్లిదండ్రులతో వచ్చి పరిశీలన చేయించుకున్నారు. చేరిక ఈ నెల 14వ తేదీ వరకు ఉంటుంది. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ బి.శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో రిజిస్ట్రార్‌ దినేష్‌ పి.శంకరరెడ్డి , డీన్‌ అకడమిక్‌ టి.కురుమయ్య తదితరులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

Grade B Officer Notification : గ్రేడ్‌–బి ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుద‌ల‌.. మూడు విభాగాల్లో మొత్తం 94 ఆఫీసర్‌ ఉద్యోగాలు

Published date : 13 Aug 2024 01:03PM

Photo Stories