Paris Olympics: ముగిసిన ఒలింపిక్స్.. ఎక్కువ పతకాలు సాధించిన దేశాలివే..!
16 రోజుల పాటు 329 క్రీడాంశాల్లో ఆటగాళ్లు హోరాహోరీగా పోటీ పడ్డారు. పతకాల పట్టికలో అమెరికా జట్లు అగ్రస్తానాన్ని ఖరారు చేసుకుంది. అమెరికా, చైనా జట్లు 40 స్వర్ణ పతకాలతో సమంగా నిలిచాయి.
2028లో ఒలింపిక్స్ క్రీడలు అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో జరుగుతాయి. అమెరికా నగరంలో ఒలింపిక్స్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 1932, 1984లో లాస్ ఏంజెలిస్‌లో విశ్వ క్రీడలు జరిగాయి.
భారత్ 6 పతకాలతో 71వ ర్యాంక్‌లో నిలిచింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి.
44 ఏళ్లల్లో తొలిసారిగా బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ 62వ స్థానంలో నిలిచింది.
టాప్ 10లో నిలిచిన దేశాలు ఇవే..
1. అమెరికా: మొత్తం 126 పతకాలు (40 స్వర్ణ, 44 రజిత, 42 కాంస్య)
2. చైనా: 91 (40 స్వర్ణ, 27 రజిత, 24 కాంస్య)
3. జపాన్: 45 (20 స్వర్ణ, 12 రజిత, 13 కాంస్య)
4. ఆస్ట్రేలియా: 53 (18 స్వర్ణ, 19 రజిత, 16 కాంస్య)
5. ఫ్రాన్స్: 64 (16 స్వర్ణ, 26 రజిత, 22 కాంస్య)
6. నెదర్లాండ్స్: 34 (15 స్వర్ణ, 7 రజిత, 12 కాంస్య)
7. బ్రిటన్: 65 (14 స్వర్ణ, 22 రజిత, 29 కాంస్య)
8. దక్షిణ కొరియా: 32 (13 స్వర్ణ, 9 రజిత, 10 కాంస్య)
9. ఇటలీ: 40 (12 స్వర్ణ, 13 రజిత, 15 కాంస్య)
10. జర్మనీ: 33 (12 స్వర్ణ, 13 రజిత, 8 కాంస్య)
11. న్యూజిలాండ్: 20 (10 స్వర్ణ, 7 రజిత, 3 కాంస్య)
12. కెనడా: 27 (9 స్వర్ణ, 7 రజిత, 11 కాంస్య)
13. ఉజ్బెకిస్తాన్: 13 (8 స్వర్ణ, 2 రజిత, 3 కాంస్య)
14. హంగారీ: 19 (6 స్వర్ణ, 7 రజిత, 6 కాంస్య)
15. స్పెయిన్: 18 (5 స్వర్ణ, 4 రజిత, 9 కాంస్య)
Paris Olympics: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ ప్లేయర్‌కు స్వర్ణ పతకం!