Digital Payments: భారత్, సింగపూర్ మధ్య ఈజీ డిజిటల్ పేమెంట్స్
భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI), సింగపూర్‌లోని పేనౌ(PayNow)ని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. రెండు దేశాల ప్రధానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొని డిజిటల్ చెల్లింపు ఒప్పందాన్ని ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని భారతదేశం నుంచి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.
భారత్ – సింగపూర్ మధ్య రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ లింకేజీ ప్రారంభించారు. దీని ద్వారా భారత్-సింగపూర్ మధ్య సరిహద్దు కనెక్టివిటీ కింద డబ్బును చాలా సులభంగా, త్వరగా బదిలీ చేయోచ్చు. సింగపూర్‌లో నివసించే భారతీయులు యూపీఐ ద్వారా భారత్‌కు సులభంగా నగదు బదిలీ చేయడం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక చారిత్రాత్మక విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటి నుంచి UPI, PayNowలను ఉపయోగించి, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు, అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులు UPI ద్వారా మన దేశానికి నగదు బదిలీ చేయవచ్చు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)
నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్ లావాదేవీలు
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) అమలులోకి వచ్చింది. అనంతరం పలు ప్రైవేటు యాప్స్ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్‌పే అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ పేమెంట్ విప్లవం ఐదేళ్లలో దేశమంతా విస్తరించింది. ఈ క్రమంలో భారత్ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ హద్దులు చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌సేఫ్(యూపీఐ)ని సింగపూర్‌కి చెందిన ‘పేనౌ’ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించింది.
Indian American: యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయుడు.. ఆయనకి సంబంధించిన ఆసక్తికర విషయాలు
A new milestone in India-Singapore relations as we link real-time digital payments systems. 🇮🇳 🇸🇬 https://t.co/SubBSNyMO8
— Narendra Modi (@narendramodi) February 21, 2023