Joint Trade Committee: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత్-నైజీరియా ఒప్పందం
దీని ద్వారా వారు వాణిజ్యాన్ని భారత కరెన్సీ (INR), నైజీరియన్ నైరా(NGN)లో నిర్వహించవచ్చు.
కీలక అంశాలు ఇవే..
ప్రతినిధి బృందం: భారత ప్రతినిధి బృందానికి అమర్‌దీప్ సింగ్ భాటియా నాయకత్వం వహించారు. ఆర్‌బీఐ(RBI), ఈఎక్స్ఐఎం(EXIM) బ్యాంక్, ఎన్‌పీసీఐ(NPCI) నుంచి అధికారులు ఉన్నారు.
చర్చలు: రెండు దేశాలు మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం, ముడి చమురు, ఫార్మాస్యూటికల్స్, యుపీఐ, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, విద్య, రవాణా, ఎంఎస్ఎంఈలు మొదలైన రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాయి.
Joint Defence Cooperation Committee: భారత్-ఇండొనేషియా మధ్య రక్షణ సహకార కమిటీ సమావేశం
సంబంధాలు: భారత్, నైజీరియా 1958 నుంచి బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. 2022-23లో వారి ద్వైపాక్షిక వాణిజ్యం 11.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. నైజీరియాను ఆఫ్రికాలో భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిపింది. నైజీరియాలో భారత పెట్టుబడులు 27 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలలో సంబంధాలను కుదుర్చుకున్నాయి.