Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మనదే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా

దీంతో టీమిండియా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. స్పిన్‌తో భారత్‌కు సిరీస్ విజయాన్నిచ్చిన బౌలింగ్ ద్వయం అశ్విన్, రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.
మరో మ్యాచ్ మిగిలుంది.. అదే ఫైనల్!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి.. డబ్ల్యూటీసీ ఫైనల్. ఇక్కడ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్‌లో 7 నుంచి 11 వరకు లండన్‌లోని ది ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )
• సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్ సిరీస్ విజయం.
• మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి ఘనత.
• భారత్ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 12 టెస్టులు ఆడిన అక్షర్ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్ సవరించాడు.
• టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 37 సిరీస్‌లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (62 సిరీస్‌లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా.. జాక్వస్ కలిస్ (61 సిరీస్‌లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు.