Skip to main content

Copa America : 16వ సారి టైటిల్‌ కైవసం చేసుకున్న అర్జెంటీనా..

Argentina achieves title of Copa America for 16th time

అమెరికా వేదికగా జరిగిన ‘కోపా అమెరికా’ టైటిల్‌­ను డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా నిలబెట్టుకుంది. హార్డ్‌రాక్‌ స్టేడియం వేదికగా జరిగిన తుది పో­రులో అర్జెంటీనా 1–0తో కొలంబియాను ఓడించింది. 112వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు లాటరొ మార్టినెజ్‌ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఈ టోర్నీ చరిత్రలో ఏకంగా 16వ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2021లో కోపా అమెరికా టైటిల్‌ నెగ్గిన అర్జెంటీనా.. 2022లో ఫిఫా వరల్డ్‌ కప్‌తో పాటు తాజాగా ఈ టోర్నీలో గెలిచి ఫుట్‌బాల్‌ చరిత్రలో స్పెయిన్‌ తర్వాత వరుసగా మూడు మేజర్‌ టోర్నీలు గెలిచిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది.

Euro Championship : యూరో చాంపియన్‌షిప్‌గా నిలిచి ఈ రికార్డును బ్రేక్ చేసిన స్పెయిన్‌..

Published date : 23 Jul 2024 04:28PM

Photo Stories