Skip to main content

WTC Final: బిగ్ బ్రేకింగ్‌... డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భార‌త్‌

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే న్యూజిలాండ్‌ టీమిండియాకు శుభవార్తను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్‌ సేనకు మార్గం సుగమం చేసింది. సొంతగడ్డపై సత్తా చాటుతూ మొదటి టెస్టులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో లంకపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Team India

తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేందుకు సర్వశక్తులు ఒడ్డిన లంక ఆశలపై ఆఖరి నిమిషంలో నీళ్లు చల్లింది. ఈ ఓటమితో శ్రీలంక పోటీ నుంచి నిష్క్రమించగా టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారైంది. దీంతో ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

చ‌ద‌వండి: 
అప్పుడలా.. ఇప్పుడిలా
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి 2019- 21 సీజన్‌కు గానూ తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాలతో ఫైనల్‌ చేరుకుంది. కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీలోని న్యూజిలాండ్‌ సైతం డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లోని ది రోస్‌ బౌల్‌ స్టేడియంలో టీమిండియా- కివీస్‌ మధ్య జూన్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఫైనల్‌ జరిగింది.

చ‌ద‌వండి: క‌ర్ర‌ల‌తో ప్రాక్టీస్... క‌టింగ్ చేస్తూ ఎదిగి..  రాహుల్ ప్ర‌స్థానం సాగిందిలా​​​​​​​
నాడు ఓడించి.. నేడు పరోక్షంగా...

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కోహ్లి సేనపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదటి డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడి మురిసిసోయింది. నాటి మ్యాచ్ లో మొత్తంగా ఏడు వికెట్లు పడగొట్టిన కైలీ జెమీషన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమిండియా ట్రోఫీ గెలవకుండా అడ్డుకున్న న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఈసారి మాత్రం ఆటగాడిగా తమ జట్టును గెలిపించడంతో పాటు భారత జట్టును ఫైనల్‌ చేర్చడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర పోషించాడు.

చ‌ద‌వండి: స్కూల్ అంటేనే బోర్‌... క్రికెటే ఎక్కువ ఆడేవాడిని.. స‌త్య నాదెళ్ల​​​​​​​
కేన్‌ మామకు జై...
ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేన్‌ బాదిన ఫోర్‌ లంక ఫైనల్‌ ఆశలను చిదిమేయగా.. అషిత ఫెర్నాండో బైస్‌ రూపంలో ఎక్స్‌ట్రా పరుగు ఇచ్చాడు. దీంతో లంక ఓటమి ఖరారైంది. దీంతో టీమిండియా దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఆస్ట్రేలియా- భారత్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరిన టీమిండియా ఈసారైనా ట్రోఫీ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Published date : 13 Mar 2023 02:06PM

Photo Stories