T20 World Cup: టీమిండియాకు రూ.125 కోట్ల ప్రైజ్‌మనీని ప్రకటించిన బీసీసీఐ
Sakshi Education
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ బహుమతి ప్రకటించింది.
పొట్టి ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు రూ.125 కోట్ల నగదు బహుమతిని అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.
టోర్నీ మొత్తం టీమిండియా అసాధారణ ప్రతిభ, దృఢ నిశ్చయం, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిందని షా కొనియాడారు. ఈ అద్భుత విజయానికి కారణమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి షా అభినందనలు తెలిపారు.
జూన్ 29వ తేదీ జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
T20 World Cup: టి20 ప్రపంచకప్ విజేత భారత్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Published date : 02 Jul 2024 10:06AM