T20 World Cup: టి20 ప్రపంచకప్ విజేత భారత్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
✦ ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి, దక్షిణాఫ్రికాను 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకు పరిమితం చేసింది.
✦ విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76) అద్భుతమైన అర్ధ సెంచరీతో భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
✦ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. జస్ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్: విరాట్ కోహ్లి (భారత్)
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: జస్ప్రిత్ బుమ్రా (భారత్)
✦ 2026లో టి20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి.
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి వీడ్కోలు!
టి20 ప్రైజ్ మనీ ఇదే..
✦ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తొమ్మిదో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఒక కోటీ 12 లక్షల 50 వేల డాలర్ల (రూ.93 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీని కేటాయించింది.
విజేత: రూ.20.42 కోట్లు(భారత జట్టు)
రన్నరప్: రూ.10.67 కోట్లు(దక్షిణాఫ్రికా జట్టు)
సెమీఫైనలిస్ట్: రూ.6.56 కోట్లు(ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్)
‘సూపర్–8’ నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన నాలుగు జట్లకు: రూ.3.18 కోట్లు
9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన నాలుగు జట్లకు: రూ.2.06 కోట్లు
13 నుంచి 20వ స్థానాల్లోపు నిలిచిన ఎనిమిది జట్లకు: రూ.1.87 కోట్లు
సెమీఫైనల్స్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు: రూ. 25.97 లక్షలు
✦ 2022 టి20 ప్రపంచకప్‌ను 56 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించగా, విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు లభించాయి.
Carlos Alcaraz: అతిచిన్న వయస్సులోనే ‘ఫ్రెంచ్ కింగ్’.. ఎంత ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడంటే..!
Tags
- India Wins T20 World Cup
- T20 World Cup Prize Money
- T20 World Cup
- Prize Money
- India
- Yuvraj Singh
- Virat Kohli
- Team India
- International Cricket Council
- Jasprit Bumrah
- Rohit Sharma
- South Africa
- England
- Afghanistan
- T20 World Cup 2024 Super 8
- Semi Finals
- Finals
- sakshi education sports news
- latest sports news
- T20worldcupprizemoney
- sakshi education latestsportsnewsintelugu