Sunil Chhetri: భారత ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి వీడ్కోలు!
ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జూన్ 6వ తేదీ కువైట్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 0–0తో ‘డ్రా’ చేసుకుంది. రెండు జట్లూ గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ తన చివరి మ్యాచ్‌ను జూన్ 11న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో ఆడనుంది.
2005లో జాతీయ సీనియర్ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన సునీల్ ఛెత్రి ఓవరాల్‌గా భారత్ తరఫున 151 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్ సాధించాడు. ఇందులో నాలుగు ‘హ్యాట్రిక్’లున్నాయి. జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు.
క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్!!
రికార్డుస్థాయిలో ఏడుసార్లు జాతీయ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అవార్డు గెల్చుకున్న సునీల్ ఛెత్రికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ (2021లో).. అర్జున అవార్డు (2011లో), పద్మశ్రీ (2019లో) లభించాయి.