Sunil Chhetri: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి రిటైర్మెంట్!!
జూన్ 6న కువైట్‌తో జరిగే ప్రపంచకప్ అర్హత మ్యాచ్ అనంతరం రిటైర్‌కానున్నట్లు తెలిపాడు. 19 ఏళ్లపాటు భారత జట్టుకు సేవలందించిన ఛెత్రి, 94 గోల్స్‌తో దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఛెత్రి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో 3వ స్థానం (150 మ్యాచ్‌ల్లో 94 గోల్స్)లో ఉండగా, రొనాల్డో (128 గోల్స్), మెస్సి (106 గోల్స్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఛెత్రి కెరీర్ హైలైట్స్ ఇవే..
➤ సికింద్రాబాద్‌లో జన్మించిన ఛెత్రి 2002లో మోహన్ బగాన్‌తో అరంగేట్రం చేశారు.
➤ 2005లో అరంగేట్రం చేసిన ఛెత్రి, 150 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాడు.
➤ 2007, 2009, 2012లో నెహ్రూ కప్, 2011, 2015, 2021లో సాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు.
Chess Grandmaster: 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్ ప్లేయర్ ఇతనే..!
➤ 2008 ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ విజయంతో భారత్ 27 ఏళ్లలో తొలిసారి ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు అర్హత సాధించడంలో సహాయపడ్డాడు.
➤ క్లబ్ ఫుట్‌బాల్‌లో ఛెత్రి మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, డెంపో, న్యూయార్క్ సిటీ ఎఫ్‌సీ, బెంగళూరు ఎఫ్‌సీ, ముంబయి సిటీ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
➤ ఏడుసార్లు ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
➤ 2011లో పద్మశ్రీ, 2019లో ఖేల్‌రత్న, 2021లో అర్జున అవార్డులు అందుకున్నాడు. ఖేల్‌రత్న అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఫుట్‌బాల్ ఆటగాడు ఈయనే.
Yuzvendra Chahal: టీ20 క్రికెట్ చరిత్రలో చాహల్ అరుదైన రికార్డు!