Chess Grandmaster: 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించిన చెస్ ప్లేయర్ ఇతనే..!
జీఎం హోదా పొందడానికి చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి.
2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు, రెండు జీఎం నార్మ్‌లు కూడా సాధించాడు. కానీ చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం 12 ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది.
చివరకు దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో మూడో జీఎం నార్మ్‌ను సాధించి, గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు.
Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బంగారు జోరు!
"ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. కానీ మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది" అని 2022లో కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు.
Female Cricket: టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్