Female Cricket: టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంధాన(33), హర్‌ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు.
బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.
ICC Rankings: వన్డే, టీ20ల్లో భారత్ నంబర్ 1.. టెస్టుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే..
భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.