Canadian Grand Prix: వెర్‌స్టాపెన్ ‘హ్యాట్రిక్’.. వరుసగా మూడో ఏడాది..
Sakshi Education
వరుసగా మూడో ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఓవరాల్‌గా 60వ విజయం సాధించాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లాండో నోరిస్ (మెక్‌లారెన్) రెండో స్థానంలో నిలువగా.. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఐదుగురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), లొగాన్ సార్జెంట్ (విలియమ్స్) రేసును ముగించలేకపోయారు. 24 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది రేసులు ముగిశాయి. ఆరు రేసుల్లో నెగ్గిన వెర్‌స్టాపెన్ 194 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని పదో రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న బార్సిలోనాలో జరుగుతుంది.
Published date : 12 Jun 2024 03:06PM