Skip to main content

Federation Cup 2024: స్వర్ణ పతకాలు నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు అనూష, రష్మీ

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ తొలి రోజునే ఆంధ్రప్రదేశ్‌కు బంగారు జోరు కొనసాగింది.
National Senior Athletics Championship  AP Athletes Anusha Rashmi Won Gold Medals in Federation Cup 2024

భువనేశ్వర్‌లో మే 12న ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల ట్రిపుల్‌ జంప్‌, జావెలిన్‌ త్రో విభాగాల్లో రాష్ట్ర అథ్లెట్లు అనూష, రష్మీ బంగారు పతకాలు సాధించారు.

మల్లాల అనూష: 13.53 మీటర్ల దూరం గెంతి అగ్రస్థానంలో నిలిచి, స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. షీనా (కేరళ - 13.32 మీ) రజతం, గాయత్రి శివకుమార్‌ (కేరళ - 13.08 మీ) కాంస్య పతకాలు సాధించారు.

కె.రష్మీ: జావెలిన్‌ త్రో విభాగంలో 54.75 మీటర్ల దూరం విసిరి, స్వర్ణ పతకాన్ని నెట్టబట్టింది. ఈ విజయంతో ఆమె అద్భుత ప్రతిభను మరోసారి చాటింది.

 

 

Female Cricket: టీ20లో భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్

Published date : 13 May 2024 05:36PM

Photo Stories