Chandrayaan-4: 2027లో చంద్రయాన్-4 మిషన్ లాంచ్

ఈ మిషన్‌లో ఎల్వీఎం-3 రాకెట్ రెండు సార్లు అంతరిక్షంలోకి ప్రయోగించబడుతుంది. రాకెట్ ద్వారా తీసుకెళ్లే పరికరాలు చంద్రుడి కక్ష్యలోనే సమీకరించి ప్రయోగించనున్నాయి.
గగన్‌యాన్ మిషన్‌లో భారత వ్యోమగాములను అంతరిక్ష నౌకలో భూమి దిగువ కక్ష్యకు పంపి తిరిగి భద్రంగా భూమిపైకి తీసుకురావడం లక్ష్యం. ఈ మిషన్‌ను 2026లో ప్రారంభించాలని నిర్ణయించబడింది.
చంద్రయాన్-4లో ఐదు వేర్వేరు పరికరాలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించి కక్ష్యలో అసెంబుల్ చేస్తారు. ఈ మిషన్ ద్వారా చంద్రుని మీదున్న రాతి నమూనాలను భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం సక్సెస్
సముద్రయాన్ మిషన్ ద్వారా జలాంతర్గామిలో 6000 మీటర్ల లోతుకు ముగ్గురు శాస్త్రవేత్తలు వెళ్లి, సముద్ర గర్భంలోని ఖనిజాలు, అరుదైన లోహాలు, సముద్ర జీవ వైవిధ్యాన్ని అన్వేషించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు.
చంద్రయాన్-4 మిషన్ కోసం రూపాయి 2104.06 కోట్ల నిధులు కేటాయించబడ్డాయి. ఈ మిషన్ 36 నెలల వ్యవధిలో పూర్తవుతుంది. ఈ మిషన్ ద్వారా భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం కూడా 2035లో ప్రారంభమయ్యే అవకాశముంది.
ISRO: ఇస్రోకు ‘వంద’నం.. ఇస్రో చైర్మన్‌లు, షార్ డైరెక్టర్లు వీరే..