Satya Nadella: స్కూల్ అంటేనే బోర్... క్రికెటే ఎక్కువ ఆడేవాడిని.. సత్య నాదెళ్ల సక్సెస్ సీక్రెట్స్ ఇవే...
భారతదేశంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల సుపరిచితుడే. హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన నాదెళ్ల.. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డిగ్రీ, విస్కోన్సిన్: మిల్వాకీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్, చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
చదవండి: యాపిల్ రాకతో భారీగా ఉద్యోగాలు... ప్లాంట్ నిర్మాణం ఎక్కడంటే
స్వేచ్ఛతోనే ఈ స్థాయికి...
కానీ, ఆయన తన చిన్ననాటి అనుభవాలను, జ్ఞాపకాలను లింక్డ్ఇన్ సీఓఓ ర్యాన్ రోస్లాన్‌స్కీ నిర్వహించే ది పాత్ అనే వీడియో సిరీస్ లో పాల్గొని నెమరు వేసుకున్నాడు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదనీ, ఎప్పుడూ చూసినా క్రికెట్ పైనే ధ్యాస ఉండేదని గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులు తనకు ఇచ్చిన స్వేచ్ఛతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు చెప్పారు. మొదటి సారి తాను కంప్యూటర్ ఉపయోగించిన సందర్భం ఇప్పటికీ మర్చిపోలేనని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
చదవండి: అశ్విన్ ఆల్‌టైం రికార్డు...
అంచెలంచెలుగా ఎదుగుతూ...
సత్య నాదెళ్ల ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆ తరువాత సన్ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం ప్రారభించి బింగ్, ఎమ్ఎస్ ఆఫీస్, ఎక్స్‌బాక్స్ లైవ్, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ముప్పై సంవత్సరాలు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఈఓ పదవిని సొంతం చేసుకున్నారు.