IND vs AUS: అశ్విన్ ఆల్‌టైం రికార్డు...
భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. షమీ రెండు వికెట్లు, అక్షర్, జడేజా తలా వికెట్ సాధించారు.
చదవండి: కోడింగ్ రాకపోయిన సాఫ్ట్‌వేర్ జాబ్... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ
కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్
ఇక 6 వికెట్లతో చెలరేగిన అశ్విన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత్ గడ్డపై టెస్టుల్లో కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 26వ ఐదు వికెట్ హాల్ నమోదు చేసిన అశ్విన్.. కుంబ్లేను అధిగమించాడు. కాగా అశ్విన్ దారిదాపుల్లో కూడా ఏ భారత బౌలర్ లేడు. ఇక ఓవరాల్‌గా అశ్విన్ కు ఇది 32వ ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.
చదవండి: ఆస్ట్రేలియాలో చదువుకుంటే నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్స్
ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు...
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్(113) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(111) రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు. మరోవైపు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్(113) రికార్డును అశ్విన్ సమం చేశాడు.