Education: ఆస్ట్రేలియాలో చదువుకుంటే నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్స్... ఇంకా ఏమేం ఉపయోగాలంటే...
వీటిలో ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడంపై నిర్ణయం తీసుకున్నారు.
చదవండి: కోడింగ్ రాకపోయిన సాఫ్ట్‌వేర్ జాబ్... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ
విద్యార్థుల కోసం కొత్త విధానం
ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆంథోనీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల ద్వైపాక్షిక విద్యా సంబంధాలు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయన్నారు. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజమ్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. దీని వల్ల ఇరుదేశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చదవండి: విదేశీ విద్య మరింత భారం.. తల్లిదండ్రులకు కేంద్రం షాక్
ఇకపై పూర్తిస్థాయి గుర్తింపు....
ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించిన కొత్త విధానం ప్రకారం.. మీరు ఆస్ట్రేలియాలో చదువుతున్నా లేదా చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు.. ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఆ డిగ్రికి పూర్తిస్థాయి గుర్తింపు లభించనుంది. అలాగే భారతీయ డిగ్రీలు కూడా ఆస్ట్రేలియాలో చెల్లుబాటవుతాయి. వీటితో పాటు ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ను కూడా ఆయన ప్రకటించారు. భారతీయ విద్యార్థులు నాలుగేళ్ల వరకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి మైత్రి స్కాలర్‌షిప్స్ ఇస్తామన్నారు. దీంతో ఇరుదేశాలు మధ్య సాంస్కృతిక, విద్యా, కమ్యూనిటీ సంబంధాలు బలోపేతమవుతాయని ఆంథోనీ ఆశాభావం వ్యక్తం చేశారు.