ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా అశ్విన్
మార్చి 1వ తేదీ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను రెండో స్థానానికి పంపించి అశ్విన్ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్నాడు. 36 ఏళ్ల అశ్విన్ తొలిసారి 2015లో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ తర్వాత పలుమార్లు అతను ఈ ఘనత సాధించాడు. గత మూడు వారాల్లో టాప్ ర్యాంక్‌లో ముగ్గురు వేర్వేరు బౌలర్లు నిలవడం విశేషం.
అండర్సన్ కంటే ముందు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 90 టెస్ట్‌లు ఆడిన అశ్విన్ 463 వికెట్లు పడగొట్టాడు. ఈ చెన్నై స్పిన్నర్ 864 రేటింగ్ పాయింట్లతో తాజాగా అగ్రస్థానానికి చేరుకోగా.. అండర్సన్ 859 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. కమిన్స్ మూడో స్థానానికి చేరుకోగా.. భారత్‌కే చెందిన బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్) ఐదో ర్యాంక్‌లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు.