Skip to main content

Ravichandran Ashwin : 18 ఏళ్ల కుంబ్లే రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అశ్విన్‌..

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
ravichandran
Ashwin

నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసిన అశ్విన్‌.. ఈ ఘనత సాధించాడు. ఇక 450 టెస్టు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

Suryakumar Yadav : సరికొత్త చరిత్ర.. భారతీయ తొలి ఆటగాడిగా సూర్యకుమార్ అరుదైన రికార్డు

అశ్విన్‌ సాధించిన రికార్డులు ఇవే..

ravichandran ashwin records


☛ టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. 89 టెస్టు మ్యాచ్‌లోనే అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది.
☛ కుంబ్లే 93 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. 2005లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు.
☛ ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్‌లు) ఉన్నాడు.
☛ ఇక ఓ‍వరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.
☛ బంతుల పరంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా గ్రేట్‌ మెక్‌గ్రాత్(23635) ఉండగా.. అశ్విన్‌(23474) రెండో స్థానంలో ఉన్నాడు.

Team India Players : ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఈత‌నే..

Published date : 09 Feb 2023 03:35PM

Photo Stories